ఆస్ట్రేలియాలో డేటింగ్ సైట్ అమ్మాయి ఇంటికెళ్లిన భారతీయ విద్యార్థి హత్య

మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. అతని పేరు మౌలిన్ రాథోడ్ (25). సోమవారం రాత్రి అతను ఓ యువతితో కలిసి డేటింగ్‌కు వెళ్లాడు. డేటింగ్ అనంతరం అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు సదరు యువతిపై కేసు నమోదు చేశారు. మౌలిన్ రాథోడ్ మృతదేహాన్ని భారత్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాథోడ్ స్వస్థలం గుజరాత్‌లోని అహ్మదాబాద్.

డేటింగ్ సైట్‌లో పరిచయమైన అమ్మాయిని కలిసేందుకు వెళ్లిన రాథోడ్ మృతి చెందాడు. విషయం తెలియగానే పోలీసులు రంగంలోకి దిగి యువతిపై కేసు నమోదు చేసి, ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు.

Indian student killed in Australia hours after dinner date, teen arrested

అకౌంటింగ్ విద్యార్థి అయిన రాథోడ్ సోమవారం రాత్రి యువతి ఇంట్లో తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు. వెంటనే అతడ్ని దగ్గరలోని ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించి మంగళవారం రాత్రి మృతి చెందాడు.

సోమవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో పశ్చిమ మెల్‌బోర్న్‌లోని సన్‌బరీ సబర్బ్‌లో ఉన్న19 ఏళ్ల యువతి ఇంటికి రాథోడ్ వెళ్లినట్టు చెబుతున్నారు. రాథోడ్ తీవ్ర గాయాలతో బాధపడుతున్నట్టు అత్యవసర సేవలకు ఫోన్ రావడంతో ఎమర్జెన్సీ సిబ్బంది వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించింది.

సదరు యువతి ఉద్దేశ్యపూర్వకంగా అతడిని గాయపరిచినట్లు పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. బాధితుడు మృతి చెందడంతో ఇప్పుడు దానిని హత్య కేసుగా మార్చనున్నారు. నిందితురాలైన యువతిని కోర్టు పోలీసుల కస్టడీకి పంపించింది.

తమ ఒక్కగానొక్క కొడుకు మృతి విషయం తెలిసిన తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. రాథోడ్ చాలా మంచి వ్యక్తి అని, క్రికెట్ ప్రేమికుడని ఆయన స్నేహితులు చెప్పారు. రాథోడ్ హత్యకు కారణాలు తెలియరాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+