అదృశ్యమైన ఎన్నారై యువతి మృతి

కాగా, ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, గురువారం న్యూపోర్ట్ సమీపంలోని సముద్రం ఒడ్డున నసీర్ మృతదేహాన్ని గుర్తించారు. నసీర్ మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. నసీర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తే గానీ మృతికి గల కారణాలు తెలియవని పోలీసులు తెలిపారు.
తన యూనివర్సిటీకి హాజరుకాలేకపోతున్నందున కొంత అసంతృప్తికి లోనైనా నసీర్, ఇంటి నుంచి వెళ్లిపోయిందని నసీర్ సోదరి షమిలా చెప్పింది. ఆమె మంచి గ్రేడ్స్ సాధిస్తున్నప్పటికీ ఆమెను ఫెయిల్ స్టేటస్‌లో ఉంచడంతో నసీర్ కొంత అసహనానికి గురైందని తెలిపింది.
అంతేగాక, నసీర్ చదువుల కోసం తాము ఖర్చు చేయలేమని నసీర్ కుటుంబ సభ్యులు చెప్పడంతో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. అనంతరం శవంగా కనిపించింది. ఎన్నిరోజులకైనా నసీర్ క్షేమంగా తిరిగి ఇంటికి వస్తుందని భావించినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications