తెలుగు రాష్ట్రాల్లో ‘నాట్స్’ సేవా కార్యక్రమాలు.. రూ. 80 లక్షల విరాళం అందజేత..!
వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడంలో ప్రవాస భారతీయులు ఎప్పుడూ ముందుంటారని నిరూపిస్తున్నారు. ఉత్తర అమెరికన్ తెలుగు సొసైటీ మరోసారి తన పెద్ద మనసును చాటుకుంది. ఓ చిత్ర నిర్మాణం లాగా అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతూ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, ప్రెసిడెంట్ రాజ్ అల్లాడ, న్యూజెర్సీ చాప్టర్ కో-ఆర్డినేటర్ సాయి గంగుల సారథ్యంలో 'సంబరం లో సేవ' పేరుతో ఏకంగా రూ. 80 లక్షల భారీ విరాళాన్ని అందించింది నాట్స్ బృందం. ఈ సేవా ప్రయాణం వెనుక ఉన్న ప్రతి ఘట్టం ఓ స్పూర్తిదాయకమైన కథలా సాగింది.
ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం
సెప్టెంబర్ 20న నిడదవోలులోని ప్రత్యేక పాఠశాల, పునరావాస కేంద్రాన్ని నాట్స్ బృందం సందర్శించింది. అక్కడ భవనం మొదటి అంతస్తులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ప్రత్యేక మానసిక వికలాంగులైన చిన్నారులతో నాట్స్ నాయకులు మమేకమయ్యారు. వారికి స్వీట్లు పంపిణీ చేసి, బ్రిడ్జి కోర్సులు, ఫిజియోథెరపీ సేవలను స్వయంగా పరిశీలించారు. మారుమూల, గిరిజన ప్రాంతాల దివ్యాంగులకూ ఈ సేవలను విస్తరించడమే తమ తదుపరి లక్ష్యమని తెలిపారు. కేవలం సాయం చేయడమే కాకుండా, దివ్యాంగులకు శాశ్వత ఉపాధి కల్పించేలా తొర్రేడులో గోపికి, వెంకటానగర్‌లో దేవదాసు చినబాబుకు కిరాణా దుకాణాల ఏర్పాటు నిమిత్తం ఒక్కొక్కరికి రూ. 1.30 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ దుకాణాలను స్వయంగా ప్రారంభించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు.

అనాథ ఆశ్రమాలకు నాట్స్ సహకారం
ఈ సామాజిక చిత్రానికి 'హోప్4స్పందన' ఆంధ్ర-తెలంగాణ సమన్వయకర్త డాక్టర్ రఘు ఆరికపూడి చక్కని దర్శకత్వ సమన్వయం అందించగా.. హృదయాలయం వ్యవస్థాపకులు డాక్టర్ గణేష్ బాబు, ఆర్గనైజర్ డాక్టర్ బలగం విశాలక్ష్మి, దయ్యాల మహేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అంతేకాకుండా, వెన్నెముక గాయాలతో మంచానికే పరిమితమైన బాధితుల కోసం నెలవారీ మెడికల్ కిట్లు అందజేయడంతో పాటు.. అనంతపురం, హైదరాబాద్‌లోని అనాథ ఆశ్రమాలకు శాశ్వత ఆశ్రయాల నిర్మాణంలోనూ నాట్స్ తన సహకారాన్ని అందిస్తోంది.














Click it and Unblock the Notifications
