అమెరికా మహిళపై ఎన్నారై టెక్కీ అసభ్య ప్రవర్తన

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: అమెరికా మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణపై భారత సంతతికి చెందిన 22 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీరును పోలీసులు అరెస్టు చేశారు. అతను గూగుల్ సంస్థలో పనిచేస్తు్నాడు. ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్లో అతను ఆ దుశ్చర్యకు పాల్పడ్డాడు.

జనవరి 8వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో హోటల్లోని బార్‌లో అన్మోల్ సింగ్ కర్బంధకు అనుకోకుండా 52 ఏళ్ల మహిళ ఎదురుపడింది. ఆమెతో అతను సంభాషణ కొనసాగించాడు.

కాలిఫోర్నియాకు చెందిన ఎన్నారై కర్బంద లాంజ్‌లో తనకు ఎదురుపడిన మహిళను పరిచయం చేసుకన్నాడు. తన హోటల్ గదిలో డ్రింక్స్‌కు, స్మోక్‌కు ఆమెను ఆహ్వానించాడు.

NRI Arrested For Molesting US Woman At 5-Star Hotel In Delhi

ఆమెను తన గదికి తీసుకుని వెళ్లి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే, ఆమె అతన్ని తోసేసి బయటకు పారిపోయింది. దిగ్భ్రాంతికి గురైన మహళ రాత్రంతా తన గదిలో బిక్కుబిక్కుమంటూ గడిపింది. మర్నాడు జైపూర్‌లోని ఓ సమావేశానికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చింది.

ఆ తర్వాత కర్బంధపై చాణక్యపురి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదేమీ తెలియని కర్బంధ తన ఆఫీసు పనిలో బిజీగా ఉన్నాడు. గుర్గావ్‌లోని గూగుల్ ఆఫీసుకు వెళ్లాడు. జనవరి 9వ తేదీన తన హోటల్ గదికి తిరిగి వచ్చాడు. ఆ విషయాన్ని హోటల్ సెక్యూరిటీ పోలీసులకు తెలియజేశాడు. పోలీసులు వచ్చిన అతన్ని అరెస్టు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 22-year-old man of Indian origin, working as a software engineer for Google, has been arrested for allegedly groping a US woman in a five-star hotel in Delhi.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి