లండన్‌లో శ్రీరామనవమి వేడుకలు: తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో..

Subscribe to Oneindia Telugu

లండన్: సోమవారం నాడు లండన్‌లో తెలంగాణ ఎన్నారై ఫోరం,జెట్ యూకె సంయుక్త ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 800మంది భక్తులు కల్యాణమహోత్సవంలో పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన,శాంతి మంత్రంతో ప్రారంభించి, ప్రత్యేకంగా తయారు చేసిన పల్లకిలో శ్రీరాముల వారిని ,సీతమ్మ వారిని తీసుకు వచ్చి కళ్యాణం ప్రారంభించారు .

లండన్‌లో మొదటి సారిగా 80కుటుంబాలు స్వామి వారి కళ్యాణం లో పాల్గొన్నాయి .శ్రీ త్రిదండి చిన్న జీయర్ గారి మఠం నుండి వచ్చిన శ్రీ రామాచార్య అయ్యగారి ఆధ్వర్యం లో కళ్యాణం నిర్వహించారు.కల్యాణానంతరం అన్నమాచర్య కీర్తనలు ,భక్తి పాటలు, సాంప్రదాయక నృత్యాలు,రామాయణం పై క్విజ్ పోటీలు,చిన్నారుల ఆట ,పాట లతో ఘనంగా నిర్వహించారు.

srirama navami celebrations in london by telangana nri forum

భారత సంతతికి చెందిన లండన్ ఎంపీ సీమా మల్హోత్రా గారు స్వామి వారి కళ్యాణంలో పాల్గొని తమను కళ్యాణం లో
భాగస్వామ్యం చేసినందుకు వారికి ధన్యవాదము తెలిపారు. భగవాన్ శ్రీ రామానుజాచార్య 1000 వ జయంతి ఉత్సవాలపై ప్రజెంటేషన్ ఇచ్చి భగవాన్ శ్రీ రామానుజాచార్య చరిత్రను తెలిపారు. శ్రీ సీత రాముల వారిని
పల్లకి ఊరేగింపుతో కార్యక్రమం ముగింపు చేశారు.

srirama navami celebrations in london by telangana nri forum

క్విజ్ లో గెలుపొందిన వారికి బహుమతి ప్రధానం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ఎన్నారై ఫోరం సభ్యులు జెట్ యూకె ట్రస్టీ మరియు సభ్యులు అందరు పాల్గొని విజయవంతం చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Srirama Navami celebrations were held in London by Telangana NRI forum. Almost 70 telugu families are participated in this event
Please Wait while comments are loading...