మహిళ రేప్, హత్య: స్వీట్ బాక్సుల్లో బ్లూఫిల్మ్స్

ఇదిలావుంటే, హైదరాబాదులో బ్లూ ఫిల్మ్స్ బాగోతం బయటపడింది. హైదరాబాదులోని బేగంబజార్‌లో పిల్లలకు ఇచ్చే స్వీట్ బాక్సుల్లో నీలి చిత్రాలు పెట్టి అమ్ముతున్న వైనాన్ని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బయటపెట్టారు. ఒక్కో స్వీట్ బాక్స్‌ను 500 రూపాయలకు అమ్ముతున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు అటువంటి బాక్సులను వందలకొద్ది స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వస్తిక్ స్వీట్ షాపులో పోలీసులు దాడులు చేశారు.
కాగా, హైదరాబాదులో ఓ దారుణం చోటు చేసుకుంది. హైదరాబాదులోని వనస్థలిపురంలో రేఖ అనే మహిళపై దాడి జరిగింది. ఆమెను హత్య చేసేందుకు బంధువులే ఈ దాడికి పూనుకున్నట్లు సమాచారం. ఇంట్లోంచి బయటకు వస్తున్న రేఖపై దుండగులు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన రేఖను ఆస్పత్రికి తరలించారు. రేఖ తన కూతురితో ఒక్కతే ఉంటోంది.
భర్త నాలుగు నెలల క్రితం ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాడు. భూవివాదమే ఈ దాడికి కారణమని తెలుస్తోంది. అన్నదమ్ముల ఆస్తి తగాదాలతో ఆమెపై బంధువులే దాడి చేశారని అంటున్నారు. ఆమెపై ఎవరు దాడి చేశారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ మహిళా అభ్యర్ధుల పరుగు పరీక్షలో అపశృతి చోటు చేసుకుంది. శనివారం ఉదయం 2 కిలో మీటర్ల పరుగుపందెలో 20 మంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారికి స్థానిక ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications
