కారులో యువతిపై రేప్: బాలిక గొంతు కొరికిన ఉన్మాది

ఈ ఘాతుకానికి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌కు చెందిన ఇంటి నుంచి తీసుకుని వెళ్లి దుండగులు కారులో అత్యాచారం చేసి, ఆమెను వదిలివెళ్లారు.
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఓ ఉన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా మెదుళ్లపల్లిలో ఓ ఉన్మాది ఆరేళ్ల బాలికపై దాడికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో ఉన్న ఉన్మాది చిన్నారి గొంతు కొరికాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
చిన్నారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాప గట్టిగా కేకలు పెట్టడంతో చుట్టుపక్కల ఉన్నవారు పరుగెత్తుకుని వచ్చారు. వారిని చూసి ఉన్మాది పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే వారు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications
