గదిలో నిర్బంధించి అమ్మాయిపై వారంపాటు రేప్

మండల కేంద్రమైన నందవరం ఎస్సీ కాలనీకి చెందిన ఓ బాలికను అదే కాలనికి చెందిన ఇరువురు యువకులు కిడ్నాప్ చేసి కర్నూలుకు తీసుకువెళ్లి గదిలో నిర్బంధించి ఆమెపై అత్యాచారం చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది. ఎస్సీ కాలనీకి చెందిన బాలిక స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అయితే అదే కాలనీకి చెందిన వార్డు సభ్యుడు ఆదాము, అతని బంధువు శాంతిరాజు ఈనెల 17న పాఠశాలకు వెళ్తున్న బాలికను ఆటోలో కిడ్నాప్ చేసి కర్నూలుకు తీసుకువెళ్లారు.
కర్నూలులోని హౌసింగ్ బిల్డింగ్ సొసైటీలో ఒక గదిలో అత్యాచారానికి పాల్పడ్డారు. తమ కూతురు కనిపించడం లేదని ఈనెల 17న బాలిక తండ్రి నందవరం పోలీసులకు ఫి ర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాలిక అ దృశ్యం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే నాలుగు రోజుల తర్వాత నిందితులు బాలికను గ్రామం శివారులో వదిలి వెళ్లడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
తల్లిదండ్రులు బాలికను స్టేషన్‌కు తీసుకువెళ్లి ఆదాము, శాంతిరాజులపై ఫిర్యాదు చేశారు. సీఐ శ్రీనివాసరావు నిందితులపై కిడ్నాప్, అత్యాచారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications