ఇరాన్ గర్ల్‌ఫ్రెండ్ కూతురిపై వ్యక్తి అత్యాచారం

31 ఏళ్ల నిందితుడు ఆస్లే క్రాస్టా ముంబైకి చెందినవాడు. అతన్ని అంజున పోలీసులు సోమవారం అరెస్టు చేసారు. అతనిపై గర్ల్ ఫ్రెండ్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. కాస్ట్రా తన గర్ల్ ఫ్రెండ్‌తో పాటు గోవాకు వచ్చాడు.
పానాజీకి 15 కిలోమీటర్ల దూరంలో గల ఆర్పోరాలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. తల్లి మార్కెట్ వెళ్లిన సమయంలో అతను ఆమె కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తిరిగి వచ్చిన తర్వాత జరిగిన విషయాన్ని అమ్మాయి తల్లికి చెప్పింది.
తనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలియడంతో కాస్ట్రా అక్కడి నుంచి పరారయ్యాడు. గాలింపు చర్యలు చేపట్టి అతన్ని అంజునాలో అరెస్టు చేశారు. పలు సెక్షన్ల కింద అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications