పోలీసులమని బెదిరించి మహిళపై గ్యాంగ్ రేప్

Rape - woman
విశాఖపట్నం: పోలీసులమంటూ బెదిరించి మహిళపై నలుగురు యువకులు అత్యాచారం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

విశాఖ నగర పరిధిలోని పెందుర్తి సమీపంలో నివస్తున్న మహిళ (35) ఈ నెల 19వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో తాను పనిచేస్తున్న దుకాణం నుంచి రిక్షా నాయుడు అనే తెలిసిన వ్యక్తిని తోడు తీసుకుని ఇంటికి బయలుదేరింది.

దారిలో మహేష్, వరప్రసాద్, రమేష్, రమణ అనే యువకులు వారిని అడ్డగించి, తాము పోలీసులమంటూ బెదిరించి ఆ మహిళపై అత్యాచారం చేశారు. మూడు రోజుల తరువాత కోలుకున్న ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆమెను వైద్య పరీక్షలకు పంపిన పోలీసులు, కేసు విచారించి నిందితులను బుధవారం అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
Are You Over 18?
By entering the site, you agree to our terms and conditions