ప్రజాక్షేమం,మంచి సమాజం కోసం ఒక్కటైన డైలీహంట్-వన్ ఇండియా-ఢిల్లీ పోలీస్ శాఖ..!

భారతదేశపు యొక్క స్థానిక భాషల్లో కంటెంట్ అందించే ఏకైక యాప్ డైలీహంట్ మరియు 9 భారతీయ భాషల్లో వార్తలు అందించే వన్ ఇండియా పోర్టల్‌ ఢిల్లీ పోలీసు శాఖతో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించాయి. రానున్న రెండేళ్లలో ఢిల్లీ పోలీసు శాఖ భద్రతాపరమైన అంశాలపై నిర్వహించనున్న కార్యక్రమాలను, అవగాహన కార్యక్రమాలను డైలీహంట్ మరియు వన్‌ఇండియాలు సంయుక్తంగా ప్రమోట్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి.ఇందులో భాగంగా సైబర్ సెక్యూరిటీ, మహిళల భద్రత,డ్రగ్స్ నిషేధం పై అవగాహన కార్యక్రమాలు,ఇతర సామాజిక అంశాలు ఉన్నాయి. డైలీహంట్, వన్ ఇండియాలకు ఉన్న అశేష ప్రజాదరణను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసు శాఖ ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకు వచ్చింది. అదే సమయంలో ఈరెండు డిజిటల్ ప్లాట్‌ఫాంలు భద్రతాపరమైన సమాచారం ఎప్పటికప్పుడు పబ్లిష్ చేస్తూ దేశ పౌరులను అప్రమత్తం చేస్తుంది.

ఈ భాగస్వామ్యంలో భాగంగా డైలీహంట్ పై ఢిల్లీ పోలీస్ శాఖ ప్రొఫైల్ ఏర్పాటు చేయడం జరిగింది.వీడియోలు, సమాచారం కలిగి ఉన్న కార్డ్స్, ఆర్టికల్స్, మరియు లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా యువతతో కనెక్ట్ అయ్యేందుకు చక్కటి అవకాశంగా డైలీహంట్ ఉపయోగపడుతుందని ఢిల్లీ పోలీస్ శాఖ అభిప్రాయపడింది. ఇదే సమయంలో వన్ఇండియా పై వ్యాసాలు, వార్తలు, ఇన్ఫోగ్రాఫిక్స్, వీడియోలు ప్రచురితమవుతాయి. ఇవన్నీ కూడా పలు భారతీయ భాషల్లో పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ రెండు డిజిటల్ ప్లాట్ ఫామ్స్‌తో జతకట్టడం ద్వారా ఢిల్లీ పోలీసు శాఖ నిత్యం పౌరులతో కనెక్ట్ అవడమే కాకుండా పలు సామాజిక అంశాలపై అవగాహన తీసుకొస్తుంది. అంతేకాదు ఈ వేదికల ద్వారా ఆరోగ్యవంతమైన చర్చలకు కూడా అవకాశం లభిస్తుంది.

Dailyhunt

"డైలీహంట్-వన్‌ఇండియాతో వ్యూహాత్మకమైన భాగస్వామ్యం ఢిల్లీ పోలీస్ శాఖకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పౌరులతో కనెక్టివిటీ బలోపేతం చేసేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుంది.డైలీహంట్ వన్‌ఇండియాకు ఉన్న అతిపెద్ద యూజర్ బేస్ ద్వారా మేము నిర్వహించే అవగాహన కార్యక్రమాలు చాలామందికి చేరువవుతాయి. అంతేకాదు ఈ భాగస్వామ్యం ద్వారా కొంత కీలక సమాచారాన్ని వేగవంతంగా పౌరులకు చేర్చేందుకు చక్కటి వేదికగా నిలుస్తుంది." అని ఢిల్లీ పోలీస్ శాఖ పీఆర్ఓ విభాగం డీసీపీ సుమన్ నల్వా అన్నారు.

"ఢిల్లీ పోలీస్ శాఖ మాతో జతకట్టడాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఢిల్లీ పోలీస్ శాఖతో మా బంధం బలోపేతం అవుతుంది.ప్రజా భద్రతపై డైలీహంట్-వన్ ఇండియా-ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా పనిచేస్తాం. ఈ భాగస్వామ్యం ద్వారా మంచి సమాజ స్థాపన కోసం కృషి చేస్తాం. అంతేకాదు నేడు జరుగుతున్న సైబర్ క్రైమ్‌ ఇతరత్రా నేరాల నుంచి ప్రజలను అప్రమత్తం చేసే పనిని డైలీహంట్ వన్‌ఇండియా బాధ్యతగా తీసుకుంటుంది." అని ఎటర్నో ఇన్ఫోటెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రావణన్ తెలిపారు.

డైలీ హంట్ గురించి:
డైలీహంట్ బహుభాషా కంటెంట్‌ను అందించే ఓ గొప్ప యాప్. రోజు ఒక మిలియన్‌కు పైగా కంటెంట్‌ను 15 భారతీయ భాషల్లో అందిస్తున్న ఏకైక యాప్ డైలీహంట్. 50వేలకు పైగా కంటెంట్ పార్ట్‌నర్ల నుంచి కంటెంట్‌ను తీసుకొచ్చి ఒకే వేదిక ద్వారా అందిస్తోంది డైలీహంట్. కోటికి పైగా భారతీయులకు నచ్చేవిధంగా కంటెంట్ అందించడం, సమాజంలో బాధ్యతాయుతమైన పాత్ర పోషించడం, ప్రజలను ఎంటర్‌టెయిన్ చేయడమే లక్ష్యంగా డైలీహంట్ పనిచేస్తోంది. ప్రతి నెలా డైలీహంట్ పై 350 మిలియన్ నెలవారీ యూజర్లు ఉన్నారు. ఒక్క యాక్టివ్ యూజర్ ప్రతి రోజూ సగటున డైలీహంట్ పై 30 నిమిషాల సమయం వెచ్చిస్తారు. ఇక డైలీ హంట్ వినియోగించే అత్యాధునిక టెక్నాలజీ‌తో యూజర్లకు మంచి అనుభూతి కలుగుతుంది.

Dailyhunt

వన్ ఇండియా గురించి:
వన్ ఇండియా అనేది పలు భారతీయ భాషల్లో వార్తలను అందించే ఆన్‌లైన్ వేదిక.2006లో స్థాపించిన ఈ న్యూస్ పోర్టల్ అప్పటి నుంచి పలు భారతీయ భాషల్లో వార్తలు అందిస్తోంది. ఒక స్వతంత్ర ఆన్‌లైన్ న్యూస్ పబ్లిషర్‌గా గుర్తింపు పొందిన వన్ ఇండియా 11 భారతీయ భాషల్లో వార్తలను అందిస్తోంది. హిందీ, తమిళం, తెలుగు, మళయాలం,కన్నడ, బెంగాలీ, గుజరాతీ,పంజాబీ, మరాఠీ, ఒడియాతో పాటు ఇంగ్లీషు భాషల్లో గత రెండు దశాబ్దాలుగా వార్తలను అందిస్తోంది. భారత్‌లో ఇంగ్లీషు మాట్లాడని వారికి ఆన్‌లైన్ ద్వారా తమ భాషలోనే వార్తలు అందించే లక్ష్యంతో వన్ ఇండియా సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. డిజిటల్ కంటెంట్ కోసం చూసే ప్రతి ఐదుగురిలో ఒకరు వన్ ఇండియా పై వచ్చే వార్తలను చదువుతున్నారు. ఇది కామ్ స్కోర్ చెబుతున్న విషయం. బహు భాషా న్యూస్ పోర్టల్స్‌లో వన్ ఇండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+