వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాల సాహితి కథా వర్క్‌షాప్‌

By Staff
|
Google Oneindia TeluguNews

విశాల సాహితీ సంస్థ కథా వర్క్‌షాప్‌ ఆగస్టు 26 - 29 తేదీల మధ్య నాలుగు రోజులు పాటు హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరుగుతుందని సంస్థ ఆహ్వాన సంఘం ప్రతినిధులు గూడూరి సీతారాం, నిజాం వెంకటేశం తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి కథల పోటీలు కూడా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. విజేతలకు వార్క్‌షాప్‌ సందర్భంగా అవార్డులు అందజేస్తారు. ఈ మేరకు వారు ఒక ప్రకటన చేశారు.

ఇదే సందర్భంలో విశాల సాహితీ బి.యస్‌. రాములు కథా పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుందని వారు చెప్పారు. దాశరథి రంగాచార్య, ఆచార్య కొలుకులూరి ఇనాక్‌ వంటి సాహితీవేత్తలు ఈ అవార్డులు పొందినవారిలో వున్నారని వారన్నారు. కథా వర్క్‌షాప్‌ నిర్వహణలో భాగంగా వివిధ రచయితలు రాసిన పలు పుస్తకాల ఆవిష్కరణలు జరుగుతాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని వారు ఔత్సాహిక రచయితలను, సాహిత్యకారులను, సామాజిక శాస్త్రవేత్తలను కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X