• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆగిపోని నిరంతర కవిత్వ ప్రయాణం ..!!

By Pratap
|

జిందగీ బహుత్ లంబా హె....కీసి కీమథ్ పే చలానా హీ పడేగ....అది కష్టం అయినా, నష్టం అయినా, భరిస్తూ పోవడమే జీవితం ..ఇప్పడు అలాంటి ఓ అద్భుతమైన జీవితం లో ఎదురు అయినా అనుభవాలకు అక్షర రూపం లో చదివించేలా ఓ ప్రయాణం లో కి వెళ్ళబోతున్నాం ..అదే డాక్టర్ దిలావర్ గారి సమగ్ర కవిత్వ పుస్తకం అయిన "lambaa hai safar" దీని గురించి ఏమి చెప్పాలి ..? .ప్రశ్న కి ముందు సమాధానం ... ఈ సమగ్ర కవిత్వం రాస్తా లో వెన్నల కుప్పలున్నాయి ...వెలుగు పూలు ఉన్నాయి.

తెలంగాణా పడ్డ పురిటి కష్టాలను, ముస్లిం కమ్యూనిటీ కళ్ళ నీళ్లను అక్షరం అక్షరం లో నింపి ఓ సామూహిక దుఖః గానం తప్పక విని తీరాల్సిందే. ప్రణయాంజలి అంటూ భగ్న హృదయాల్ని ఒక్క చోట చేర్చి సేద తీరాలన్నా, గ్రౌండ్ జీరో నుంచి కర్బలా వరకు అక్షరం అక్షరం లో ...నిబద్దత కనిపిస్తుంది ...పాఠకుడి ని ఆసాంతం చదివించేలా ఉంటే ఆ పుస్తకం, రచయత గొప్ప విజయం సాధించినట్టే...ఆ విషయము లో ఈ పుస్తకం అయితే వంద మార్కులు ఎప్పుడో దాటేసింది అని చెప్పొచ్చు ..ఇంత గా చెప్పుకోవాల్సిన విషయము ఏముంది అని మీకనిపిస్తే తప్పక ఈ పుస్తకాన్ని చదివి అర్థం చేసుకొని ...కవి ఆలోచనలతో ప్రయాణం చేయాల్సిందే ..

ముందుగా తెలంగాణ కవితల నుంచి మొదలు పెడితే తెలంగాణ నుంచి కొత్త సూర్యోదయం ముస్లిమ్ ల డెబ్భై ఐదేళ్ల సాహితి ప్రస్థానం లో ఎన్నో ప్రశ్నలున్నాయి, సమాధానాలున్నాయి, తండ్లాటా వుంది ...అన్ని.!!ముల్కి నుంచి మొలకెత్తిన విప్లవ విత్తనాలు కంటి లో నలుసులే..."నెత్తురు ముద్దగా మారిన నా తెలంగాణ, ఏ విధ్వసం వైభవానికి ఆనవాలు ? అన్న ప్రశ్న కి ఎవరు బదులు ఇవ్వగలరు ..కడుపు మంట తో రగిలే మా పేగులు ఇప్పుడు రుద్రవీణలే "జై తెలంగాణా" అని జుంగ్ షురూ చేస్తాం అని గర్జన కి తిరిగేది ...సరే బరి లోకి దిగాక కస్టపడి పోరాడి సాధించుకోవాలి కానీ అర్థాంతరం గా ప్రాణాలు ఇడిసిపెట్టడం నచ్చలే బిడ్డ, బరిగీసి పోరాడాలి అని తెలంగాణ కోసం కొట్లాడిన ప్రతివొక్కడి వెనుక అక్షరమై నిలబడతారు ..పోరాడితే పోయేదిమి లేదు, ప్రాణం తీసుకునే పిరికితనం వద్దు బిడ్డలాల ...బలిదానాలు కాదు ...బరిగీసి పోరాడాలి ..ముసలితనం చావు చూడాలేగాని, మీ తలకొరివి పెట్టడానికి కాదు అన్నప్పుడు దుఃఖం కుండపోతలా కురుస్తది.

Pusyami sagar reviews Dilawar's Lamba Hai Safar poetry

అస్తిత్వ యవనికపై అవమానాల దృశ్య పరంపరని, బాస, యాస లను దుశ్శయన పర్వం లో వలవలూడిన దిగంబరత్వపు దృశ్యాలని చేర్పివేయాలి అది రేపటి దృశ్యమై మనందరి కళ్ళలో వెలుగై ప్రభవించాలని ఆకాంక్షించడం లో తప్పేమి లేదు .. ఇంకో మాట కూడా చెప్తూ భరోసా ఇస్తారు ...ఆత్మాహుతి కి ఆవేశాన్ని డబ్బాలకొద్దీ కుమ్మరించుకోకు //రాజకీయ ఎడారిలో ఒక్క నెత్తురు బొట్టు కూడా చిందించకు/తల్లి కి గర్భశోకం మిగల్చకు ....పోరాడి సాదించుకుంటే రేపటి దృశ్యాన్ని ..తెలంగాణ విజయాల్ని చూడగలుగుతాము అంటారు .ఉద్యమ ఊపిరి గా నిలిచినవాళ్లు ..భూమి కోసం భుక్తి కోసం, బానిసత్వ విముక్తి కోసం ప్రతి తెలంగాణ ముద్దు బిడ్డ ఆకాశం లోకి శిరసెత్తుకోని బడతాడు ఉదయం సాక్షి గా అదంతా పోరాట స్ఫూర్తి నే కదా..ఇంకా ఈ తెలంగాణ కవితల్లో మా ఊరి చెరువు నిజాం నెత్తురు తాగెటోడే , అల్విదా శంకర్ సార్ ...ఏ కవిత ని కదిలించినా ఆలోచింప చేస్తది ...ఆవేశాన్ని రగిలిస్తుంది ..

ముస్లింవాద కవితల్లో ని ఆర్థ్రత, ఆవేశం ఓ నిగూఢమైన వేదన ప్రతి అక్షరం లో కనిపిస్తుంది ..."నేను కసాయిబు" ను కాను , అనివార్య హింసావృత్తి లో జీవన పరమార్ధాన్ని దర్శించే ముస్లిం ధర్మవ్యాధుణ్ణి ...అని తన అస్తిత్వాన్ని సగర్వం గా ప్రకటిస్తుంటూనే కరుడు గట్టిన మీ కసాయితనం ముందు నా కాలే కడుపు కటికతనం ఏ పాటిది అని సగటు ముస్లిం పౌరుడు గా ప్రశ్నిస్తాడు. తన బతుకు లో పండగ వచ్చినా ఆనందం కన్నా కూడా అవస్థలతో కష్టాలతోనే పండగ చేసుకుంటాను అని "ఈద్ ముబారక్" లో తన బతుకు పడే యాతన ని కళ్ళముందు ఉంచుతారు .."బతికి ఉన్నన్నాళ్ళు రోజాలోనే ఉంచుంటున్న దరిద్రం ఎప్పుడు అంతమవుతుంది ? దువామాంగో అల్లాసే, కష్టాలతో కన్నీళ్లతో ఈద్ ముబారక్ .. "ఆంధర్ పరేషానీ రగులుతున్న, ఊపర్ షేర్వాణీ లతో ఉరేగుతున్నాం ...అని తమ జీవితాన చిత్రాన్ని చూపిస్తారు

"కర్బలా" సాక్షి గా ఎన్నికల మైదానం లో మమ్మల్ని కోడిపిల్లల్ని చేసి నువ్వు గద్ద ఆట ఆడినప్పుడు అల్లా మాకు మిగిలేవి "శార్గతే, మిగిలేదే కన్నీళ్లే అనాది నుంచి వస్తున్న ఓటు బ్యాంకు రాజకీయాలని నిలదీసి కడిగేస్తారు ..మా బతుకుల్ని మండించిన నీ విశ్వాసరాహిత్యానికి, నమ్మకద్రోహానికి దళిత కోరస్ "అల్విదా " పడటమే అని తమ బతుకులను నిర్ణయించే రాజకీయాలకి చరమగీతం పడాల్సిందే అంటారు శపించకు అయేషా, పుణ్యమూర్తులను ప్రసవించే అమృత మాతృమూర్తుల కోసం అక్షరాలు దివిటీలై వెలుగుతున్నాయి , వేడెక్కుతున్నాయి అంతలోనే శపించకు అయేషా...:దేశభక్తి అంటే కోట్లాది మనసులోని విధ్వంసం చేసి శరీరాల్ని ఓట్లు గా మార్చడం కాదు ...దేశ నరాలలో ప్రాణ శక్తి గా మారి ప్రవహించడం ...దేశ భక్తిని నిరూపించుకున్న తన వారి త్యాగాలను గుర్తు చేస్తూ ..దమ్ముంటే బయలుదేరు. మనదేశ శత్రువు నడిచే దారిలో మందుపాతర్లమై పేలుదాం//స్వేచ్ఛ రెపరెపలాడుతూ పైపైకి ఎగసి పడటానికి నీలాల గగనమై ఆవరించుకుందాం రా..దేశభక్తి కి మతం అడ్డు కాబోదని, నేను సగటు భారతీయుడనేని సగర్వం గా ప్రకటిస్తారు .

ఓ వైపు సామాజిక బాధ్యత ని మరవకుండానే జీవిత లోని బాధలని , కన్నీళ్ళని తాత్త్వికత ని అక్షరాల్లో చక్కగా చెప్తారు "వెలుగు పూలు" లో ధనవంతులకు పేదవారికి మధ్య అంతరాలని ప్రశ్నిస్తూ ఇవేప్పటికీ సమసిపోను ...రాశులు ఇప్పటి కాలానికి ఎలా సరిపోతాయి ..."దివ్యం గా వుంది పేరు బలం" ధనవంతుడు పట్టిందల్లా బంగారమే ...ఇక జీవన రాగం లో ఉహల లోకం లో స్వప్న తీరాలలో వెర్రి గా తిరిగినప్పుడు వాస్తవం రాయి లా తగిలి నొప్పెడుతుంది ..కుటుంబం లోని ఆశలపై కోరికలకి కళ్లెం వెయ్యలేని స్థితిలో నుంచి వచ్చిన చీకటిని తొలిగించడానికి వెలుతురూ సబ్బుబిల్లే శరణ్యం ..మాసిన బతుకు చొక్కా ను ఉతికి తొడుక్కోడమే గత్యంతరమని ఆస గా ముందుకు పయనం అవుతాడు నేటి సగటు మధ్యతరగతి జీవుడు .అలాగే కొత్త పుట్టుక పుట్టు, మానవతను మరిచి ఉగకు , మానవతా తలుపు తట్టి నీ కాలానికి గళం కి కొత్త పదును పెట్టు, నేల విడిచి సాము చేసే వారికి, ...కష్టాల గురించి కాక సౌందర్యం గురించి మాట్లాడే వారిని కాస్త కళ్ళు తెరిచి చూడమంటారు... ఒక నవ్వు ఏమి చెయ్యగలడు మహా అయితే మనిషి కి మరో మనిషి తో వారధి ని ఏర్పరచగలడు ..మహా అయితే ప్రేమ ని పుట్టించగలదు కానీ ఇక్కడ నవ్వు ఎన్ని రకాలో "నవ్వులు" లో ....ఒక నువ్వు నిరుపేదవానికి నీడనిచ్చు/విష వాహినుల వెల్లువనగా మించు/ఆకాశ మంటల సృజించు ...నవ్వు కి అంత పవర్...ఇక వెలుగు పూలు లో మొనలు దేలిన ముళ్ళన్నీ మొక్కవోగా పూవు పూవుకు గుండెలుప్పొంగవలను, వెలుగు గుండెలో నింపుకొని విరయవలెను ఎంత అద్భుతం కదా....చక్కగా చెప్పారు ...

ఇక "వెన్నల కుప్పలు " లో సంతృప్తి ని మించిన స్వర్గం లేదు ...అసంతృప్తిని మించిన నరకం లేదు, గుండెలోంచి అసంతృప్తి ని తీసివేస్తే వచ్చే శేషమే స్వర్గం, మనసు ను కోరికలతో హెచ్చవేస్తే వచ్చే లబ్ధమే నరకం ... మూడు ముక్కల్లో జీవితానుభవాన్ని చెప్పిన వారికీ హాట్స్ ఆఫ్ ...ఇక దూరపు కొండలు ఎప్పుడు నునుపుగానే ఉంటాయి ...చూడ్డానికి దూరం గాఉంటుంది కానీ దగ్గరికి వచ్చేసరికే ...మనకి అంతగా నచ్చకపోవచ్చు ..వెగటు కల్గించవచ్చు ....అందుకే వగలు పోతు శూన్యం వరూధిని!...నేనుమో కాను ప్రవరాఖ్యుడని ..ఎంచక్కా విడిచి వచ్చాను నింగిని అని గడుసుగానే సమాధానమిచ్చారు ...రాత్రంటే ఎవరికీ ఇష్టం ఉండదు ...చీకటి ని చీల్చే కల ను కనుకుంటు కవితలు రాసే ఓ అద్భుతమైన వాతవరణాన్ని రాత్రి కల్పిస్తుంది కదా...అదే రాత్రులగురించి ఎంత అందం గా వివరంచారో చూడండి

...."కొండాకోనల గుండెల్లో స్పందిస్తూ./నిశ్శబ్దం లోగుండెల్లో శబ్దం ఉంచే మృదుల సంగీతంతో , సౌందర్యాన్ని ఆరాదిస్తూనే ...ప్రతి రేయి ముందు గుండెలు చెపుతున్నాను. ఓ రాత్రికి పిడికెడు కలలు ప్రధానం చెయ్యండని ...వాహ్ ...ఎంత చక్కని వర్ణన.. ...రోడ్ పై అద్భుత చిత్రాలను చూసి కళ్ళార్పకుండా ఉండలేము ..అంత అద్భుత చిత్రాకారుడి ఆకలి ని ఆ కుంచె చేతులని మనం అస్సలు పట్టించుకోము ....వందలు వేలు ....కార్పొరేట్ కంపెనీ ల వినోదాలకు తగలేస్తాం కానీ రోడ్ పై చిత్ర కళాకండాల్ని నిర్మిచి నిజమైన కళాకారుడి కలని గుర్తించం డబ్బులు ఇవ్వడానికి కూడా చేతులు రావు ..అతను సిటీ చౌరస్తా సిలువ మీద చిత్ర కళా రుధిరం చిమ్మే యేసు అంటారు ..."ఆకలి మేకుల్లా ప్రేగుల్లో గుచ్చుకుంటుంటే,// కళ్ళే కానీ జేబుల్లేని జనాన్ని చూస్తున్న ఏసు కళ్ళలో కన్నీళ్లు //...ఓ కళాకారుని దైవ దూత తో పోల్చడం కళల పట్ల వున్నా గౌరవం...జీవిన కావ్యం లో అగణితం గా మనసు పొరల్లో వృధా భరితం గా వున్నా జ్ఞాపికలను తొలగించకు జీవన కావ్యం లో ప్రతి ప్రశ్న ని వ్యధాభరితం గా స్వీకరిస్తావు ...ప్రతి పుట కింద వెతుక్కోవాల్సిందే అనుభవాల దీపికాలు, అవి ఆసాంతం "అధోజ్ఞాపికలు".

జీవిత తీరాలు లో ఆపదల తుఫాను రొద చేస్తున్నా కష్టాల కడలి లో భారంగా సాగింది బతుకు నావ..అయినా తప్పదేది కాదు కదా....నిన్న, నిధుల జీవన తీరాలు దూరాలు చేరువ అవుతాయా ఎప్పటికైనా....అంతే కదా ..మరి జీవితం. అసలు ఇంకా జీవితం పై క్లారిటీ గా రావాలంటే జీవితం గురించి చదవాల్సిందే. జీవితం అంటే "శోకం పెదవుల పై విలాసంగా నర్తించే దరహాసం జీవితం ..అపరిమిత వేగంతో దూసుకుపోయే, గమ్యంలేని పరుగు జీవితం..!!, జీవితానికి విధి కి విడదీయలేని సంబంధం ":విధి " రెండు రెండే....పరిగెత్తే రైలు పక్కన పొంచి ఉంటుంది ..ఇష్టమైతే సలాం కొడుతోంది ..లేకుంటే నిన్నే వెక్కిర్తిస్తుంది అది అంతే ఎందుకంటే విధి ..ఇక ప్రేమ ...ప్రేమ గురించి ఎంత చుపెపైనా తక్కువే...చూడండి.

జీవితం, విధి, ప్రేమ మూడింటిని విడదీసి చూడలేము ప్రేయసి ని తల్చుకుంటూ నా లైలా కాళ్ళ సముద్రాలు సృష్టించిన చూపుల తుఫానుల్లో కొట్టుకుపోతున్నాను సౌందర్య లోకాలలో ...నీ పాదాలపై పూజా కుసుమాలై రాలిపోని ...ఎవరికీ తెలుసు కలం పువ్వు మనల్ని పరిమళాన్ని మార్చుకోదని ..ఎంత అందమైన ఊహ...తన ప్రేయసి కి భరోసా ఇస్తూ మన ప్రేమ మృత్యుంజయమని సవాలు చేస్తారు .....ప్రేమ స్నేహం రెండు వేరు వేరు కావు ఒక దానితో మరొకటి పెనవేసుకున్న చక్కటి బంధం...వాటి గురించి చెప్తూ ..స్నేహం ఆశయాల శిఖరాల మీద ఉదయించే మైత్రి సూరీడ్ని స్వార్థం తో కప్పి పెట్టమాకు ...స్నేహం జీవిత కురుక్షేత్ర యుద్ధం లో విజయ రాధా సారధి లాంటిది .

.అలాంటి స్నేహాన్ని ఎవరైనా వదులుకుంటారా ...మనిషి మనుగడ కు ప్రేమ ఎంత ముఖ్యమో స్నేహం కూడా అంతే ముఖ్యం ..గాయూలు మనిషి కి ఉత్తేజాన్ని ఇస్తాయా...? జీవితం ల తగిలిన గాయాలు గత స్మృతులకు సాక్షీ భూతాలే...రణ యజ్ఞం లో నాగళ్లు శిలావులుగా మోస్తున్న యేసులకు ఏ పునరుత్తానం ఆశ పెడతావు .., రెక్కల కష్టం తో వాడి అంతస్తులకు రెక్కలొస్తుంటే//ఆడపడుచు మెనూ వాడు పొడుచుకు తింటుంటే ...నోట్ల బలం తో నీ నోరు మూయిస్తుంటే ..ఇవన్నీ ఇప్పటి దమననీతికి దౌర్జన్యానికి కారణాలు వీటిని ఆపాలి .,.ఆపాలి అంటే పిడికెళత్తాల్సిందే ..ఎవడికి కడుపు నొప్పి వస్తే వాడే మందు తినాలి అన్న ఆర్యోక్తిలా..కడుపు మందినోళ్లంతా కలిసి ఎదురుతిరగాలనేది ఇప్పటి సూక్తి ..నిజమే...బానిసత్వాన్ని ఎందుకు సహించాలి ....కలిసి పోరాడదండి ...సాధించుకు రండి అని వెన్నుదన్ను గా నిలబడ్డారు ..

ఇక కర్బలా, రేష్మ ఓ రేష్మ, గ్రౌండ్ జీరో ఒక సామూహిక గానం లాంటి సంపుటిలు వున్నాయి ..ప్రతి ఒక్క కవిత చదివింపచేసేవే...ఆలోచింప చేసేవే...ఈ కవితలు కొన్ని కన్నీళ్లు పెట్టిస్తాయి, దౌర్జ్యన్నాన్ని ఎండగట్టమంటాయి ..మరికొన్ని దశ దిశా నిర్ధేశం చేయిస్తాయి ..దిలావర్ గారి సమగ్ర కవిత్వం ఎక్కువా గా పేదవాడి పక్షానే ఉంటుంది .. ప్రగతిశీలభావాలతో రాసిన కవిత్వం ప్రతి ఒక్కరిని కదిలిస్తుందను సామాజిక స్ప్రుహ కలిగి నిబద్ధత కలిగిన మంచి కవి, రచయత, కథకులు అయినా దిలావర్ గారు ఇప్పటికి పదును తగ్గకుండా రాయడం గొప్ప విషయం ..దిలావర్ సమగ్ర సాహిత్యం లోని మరికొన్ని సంపుటిల గురించి మరో వ్యాస్యం లో తెలుసుకుందాం ...మంచి పుస్తకాన్ని అందించిన దిలావర్ గారికి వందనాలు ...ప్రముఖుల ముందు మాటలు ...కవిలోని కవిత్వానికి నిజమైన గీటురాళ్ళు అని చెప్పకతప్పదు ..అందరు తప్పక చదవాల్సిన పుస్తకం ఈ "lamba hai safar", డాక్టర్ దిలావర్ సమగ్ర కవిత్వం ..

-పుష్యమీ సాగర్
9032215609

English summary
Pusyami Sagar reviewed prominent poet, from Khammam of Telangana Dilawar's poetry Lamba Hai safar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X