రోడ్డు
మనిషినికదా...
స్పందిస్తాను
అన్నమడిగిన వాడికి
ఇంటికి పిల్చి అన్నం పెట్టినప్పుడు
బూబమ్మదెంత పెద్ద మనసోఅన్నమాట
నా మనసుని
అంటిపెట్టుకున్న వాక్యం
నీకూ నాకూ మనందరికీ
మానవత్వమంటేనే ఇష్టం
కులంమతం లేని కలలు
కుప్పలుగా ఆరుద్రల్లా
జీవిత మైదానంలో సున్నితంగా.....
తొక్కుతూ ఎన్ని నిర్దాక్షిణ్యపు పాదాలో...
భూమి తల్లి మెళ్లోకి
అందరం పూలమాలనే స్వప్నిస్తాం
కబంధ రేకల మధ్యఅదృశ్యమవుతున్న
ఎన్ని గుభాళింపులో...
అవునిప్పుడు వేటికవి విడివడి
సంఘటితం కావడమే అనివార్యం!
గాయంమానసికమైనా
తల్లడిల్లడం నిజం కదా
ఒక చెంపన కొడితే
మరో చెంప చూపించడం
మానవత్వమెలా అవుద్దో అర్థం కాక
ఒక మజీదును కూలగొడితే
మరో మజీదును చూపించలేక
లోలోన గగ్గోలు పడుతున్నదాన్ని
రేపెప్పుడో రెండ్నిమిషాల
మౌన నాటకం నాకక్కర్లేదు....
ఈక్షణం హత్యించబడుతున్న
మనుషుల గురించి మసీదుల గురించి
కన్నీళ్లుగానో కవిత్వంగానోపలవరిస్తాను
ఈ మట్టిలో కలిసిన మారక్తమాంసాలను
చేతనయితే జల్లెడ పట్టండి
ఈ భూమిలో మమేకమైన
మా మనసులను
విడగొట్టగలరేమో చూద్దాం
ఎప్పుడోకూల్చబడ్డ దేవాలయాల బరువు
ఇప్పటి నా భుజాలపై వేయొద్దు
నొప్పితో సలుపుతున్న గాయాల్ని
కవిత్వీకరించుకుంటున్న మమ్మల్ని
ఈగల్లా మత వాదులన్న ముద్రతోసతాయించొద్దు
నేనునా దేహానికే కాదు
నా దేశానికి బాధొచ్చినా
సహించలేనిదాన్ని!
-షాజహానా
లతీఫ్- సామేలులు
రూట్స్
మర్ఫా
పాషాణం
గుడ్లగూబ
మొగిలిచెర్ల
నాకలల పునాదులు
విజయంగొడ్డలిది కాదు చెట్టుదే
చేలోకిపురుగులొస్తున్నాయి
సహజీవనంవర్ధిల్లు గాక!
మొబైల్పక్షులు
చెలిమి
క్షీరదాలు
ఉభయచరాలు- అండజాతులు
డివైన్రోమాన్స్
కొత్తపుట్టుక
సంకల్పబలం
సముద్రజీవులు
ఎలానడుస్తావో
వానకిటికీ
విశ్వమానవత
చిలుక
మబ్బులు
ఆగంతకుని స్వప్నం












Click it and Unblock the Notifications
