ద్వైతం
జీవకణంరగిలి
విత్తనం పగిలి
ఆకాశమంత ఆవరణలోకితొంగిచూస్తాను.
శూన్యాన్ని
భావపరంపరలతో నింపి
ఒక మహాప్రపంచాన్ని సృష్టిస్తాను
లోతుల్లోకి
ఊపిరి బొక్కెన వేసి
పాతాళ రహస్తీరాలనురాబట్టుకుంటాను.
అనంతకోటి ప్రజాసముదాయం
ఆర్తి చిత్రాన్ని
రక్తచలన సంవేదనతో గీస్తాను.
నిత్యం
అక్షరాల్లో దగ్ధమవుతూ
అజరామర గీతమై బతుకుతాను.
-డాక్టర్ ఎన్. గోపి
సముద్రజీవులు
ఎలానడుస్తావో
వానకిటికీ
విశ్వమానవత
చిలుక
మబ్బులు
ఆగంతకుని స్వప్నం












Click it and Unblock the Notifications