సాహితి
కాళ్లుమనవే
చేతులు మనవే
చేస్తున్న పనులు
నడుస్తున్న నడకలు
మనవి కాకుంట పోతున్నయ్
మాటమనదే
పాట మనదే
మాట్లాడుతున్న వేదిక
పాడుతున్న రాగం
మనకు చెందకుండా అయితున్నయ్
నెత్తురుమనదే
కడుపు మనదే
కొట్టుకుంటున్న జీవునం
పడుతున్న తొక్కులాట
మనకు అందకుండా పోతున్నయ్
నీరుమనదే
భూమి మనదే
పారుతున్న పొలం
పండుతున్న పంట
మనం పొందకుండాతరలుతున్నయ్
కన్నుమనదే
కల మనదే
కనబడుతున్న గుణం
కలెపడుతున్న నిజం
మనకు చిక్కకుండా వాడుతున్నయ్
టేబుల్‌మనదే
మనసు కాలుతుందంటే
కడుపు మీద కొడుతుండ్రు
మనిషి కాలుతుండంటే
గుండెల మీద తన్నుతుండ్రు
రక్తం ఉడకబట్టె
గోస తీరకపాయె
ఆశ చావకపాయె
ఓఅయ్యా! అవ్వా!
ఓ అన్నా! తమ్మీ!
ఓ అక్కా! చెల్లే!
నెత్తుర్లు పారంగా
మా నేలను వడిపెట్టవడిత్రి గదరా!
మనసు నీళ్లు నీళ్లు అయిపోంగా
మా పానాలను వడగట్టవడిత్రి గదరా!
కిరాతకుడా!కిరాతకుడా!!
తెలంగాణ వీర బాలశిక్షలో
నీవొక కుట్రదారునివి
పాపాత్ముడా! పాపాత్ముడా!!
తెలంగాణ గోస చరిత్రలో
నీవొక నీళ్ల దొంగవి
-జూకంటి జగన్నాథం
అక్షరాల్లోదగ్ధమై..
వినగలిగితేబాగుండు!
ప్రాచీనఉదయం
దర్పణం
ఆమె
పార్టీలెక్కలు
ఆత్మకథ
తుఫానులు
చెన్నప్పనానీలు
పట్నంలోపల్లె
అమ్మకలలోకొస్తే.....
చారెడుభూమి కోసం
నడిచెక్కుతిరుపతి కొండ
సంజీవిపుల్ల
అసమాపకక్రియ
పహారా
యాది
మాయ
మేట్రిక్స్
నీకేమెరుక?!
పుటం
ఒంటరిగుంపు
చిరునవ్వు
ఇన్సానియత్
అమ్మ
మావూరి పూల మొక్క
భూమిభాష
జలపాతం
ఒకానొకరాత్రి న్యూయార్క్‌లో...
జంతర్‌మంతర్ పెట్టె
బాపూ!నన్ను మన్నించు!!
ఈదీ
మళ్లీపిట్టలొస్తాయి
సిరాచుక్క
సశేషం....
పిల్లలునిద్దరోతున్నారు
నేనుబహువచనం
అటువైపుకి
వెనిజులా!వెనిజులా!
మ్యారేజ్
పరాయికరణ
ఉనికి
నేను
తెలంగాణకాశ్మీరు కాదు!
హైకూలు
చకోరాలు
మావూరు
అమృతం
అమెరికా- చమురు
రోడ్డు
లతీఫ్- సామేలులు
రూట్స్
మర్ఫా
పాషాణం
గుడ్లగూబ
మొగిలిచెర్ల
నాకలల పునాదులు
విజయంగొడ్డలిది కాదు చెట్టుదే
చేలోకిపురుగులొస్తున్నాయి
సహజీవనంవర్ధిల్లు గాక!
మొబైల్‌పక్షులు
చెలిమి
క్షీరదాలు
ఉభయచరాలు- అండజాతులు
డివైన్‌రోమాన్స్
కొత్తపుట్టుక
సంకల్పబలం
సముద్రజీవులు
ఎలానడుస్తావో
వానకిటికీ
విశ్వమానవత
చిలుక
మబ్బులు
ఆగంతకుని స్వప్నం












Click it and Unblock the Notifications