అయిల సైదాచారి కవిత గుహ

కలలన్నీ నా అవివాహిత ప్రియురాలి ప్రసవచారికలతో భయానకం.
కళ్లలో మాయమైన కాంక్షల్ని వెదకకు
ఇన్ని మోహాల చిక్కుదారుల్లో తప్పిపోయి పెనుగులాడుతున్నా
నా తెగిన చిటికెన వేలునింకా పట్టుకునే వున్నావా
ఎన్ని క్షమాపణల చీకటి రోజుల
ఇంకిన ప్రవాహాలు నాలోంచి నీలోకి
నా పగిలిన చూపుల శూన్యాల్లో విస్ఫుటించే అదృశ్యతడి
కాలుతున్న పెండ్లిబట్టల కమురువాసన
మన పెనవేసుకున్న దేహాల
కంపనకు నెర్రెబాసిన నేలకు నువ్వో వైపూ నేనో వైపూ
మిగిలిపోతాను నా ఫిడేలు తీగపై
కమాను కింద నలిగిపోతూ
పారిపోతావా నా గుహలోంచి
కోరల గాయాల మంటల్నూదుకుంటూ, ఆర్పుకుంటూ-












Click it and Unblock the Notifications