డాక్టర్ సుమతీ నరేంద్ర కవిత 'నగరం'

పల్లెల రక్తాన్ని పీలుస్తున్నాయి
నొప్పి తెలియదు, బాధా కలగదు
పల్లెలు శిథిలమవుతూ
నగరాల్లో ఆకాశహర్మ్యాలను లేపుతున్నాయ్
మేధావులు అమాయకులను
దోపిడీ చేయడం సజావుగా సాగుతోంది
సర్కారు చలువతో
రహదారాలు, రస్తాలన్నీ పట్నాలకే
అధికార యంత్రాంగమంతా అందుకే
విద్య్తుత్తు వెలుగులన్నీ వాటికే
పాలు, పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు
పట్నాలకందించే యంత్రాలు పల్లెలు
దేశానికి వెన్నెముక రైతంటూనే
వంగుతున్న రైతుల వెన్నెముకల మీద
నగరం నాగరికత నిర్లజ్జగా స్వారీ చేస్తోంది.












Click it and Unblock the Notifications