పాఠశాలల వంటి జైళ్లు

 Jwalitha's poem on school
ప్రతి పాఠశాల ఒక తీహార్ జైలు
మూలమూలన ఒక అపసవ్యవు యజ్ఞోపవీతం
స్వమర్థన పరస్పర మర్ధనతో అంతా నిత్యానందమయం
అసమర్థుల సమర్థవంతపు సమర్థవంతపు సమస్యలు సర్వత్రా సత్యం
సమర్త కాని బాలబాలింతల ఉత్పత్తులు నిత్యం
ప్రతి విద్యార్థి అండర్ ట్రయల్ నిందితుడే
అనధికార జూదశాలలై
అధికార పాక(న)శాలలౌతున్న పాఠశాలల్లో
కేర్‌ఫ్రీలతో ఖాలీ కవర్లతో
ఎవరైనా ఎన్నిసార్లయినా లోబరుచుకోవచ్చు

చెదపురుగులు చీడపురుగులు
చీమలకు సీతాకోక చిలుకలకు
జీవితాన్ని బోధిస్తామంటూ బాధిస్తాయి
బృహన్నలలు కలియుగ కుంతులను సృష్టిస్తారిక్కడ
అపర భీష్ములు అంపశయ్యలు దిగరు
అపర ధర్మరాజులు పాఠాల సమయాన్ని
బంగారు జీవితాల్ని ఫణంగా పెట్టి జూదాలాడుతారు
అపర గాంధారులు చర్చల ప్రపంచాన్ని తిరిగేస్తుంటారు
అహంకార కళల్లో మారిన రంగులు కొన్ని
సిరా రంగులు మారి అహంకరించేవి మరికొన్ని
మోనాసాలీళ్లు లోహపు గూళ్లతో వలలు పన్నుతుంటాయి
మోదుగుపూల వనాలు తగలబడుతూ వెలుగుతాయి
పురుగులు మాడిపోయి పూలు కాలిపోయి
మిగిలిన బూడిద కుప్పలను పాలిస్తారు రాణులు

- జ్వలిత

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+