కవిస్వరం: చక్రవాకం

జ్యోతిర్మయి మళ్ల ఓ విషాద కవితను రాగంతో మిళితం చేసి మనకు అందించారు. కొత్త వ్యక్తీకరణలతో ఆమె కవితను ప్రాణవంతం చేశారు. పాటకి గొంతు పుట్టిళ్లు, గుండె గోడలెంత బలహీనమో అని అనడం ద్వారా ఓ వాతావరణాన్ని కల్పించి పాఠకులను ఆకర్షిస్తున్నారు. ఆమె విషాద గీతం గురించి ఈ కవితలో మాట్లాడినట్లు కనిపిస్తున్నారు.

విషాద గీతానికీ, జీవిత విషాదానికి దేహం చెందే మార్పులను అన్వయిస్తూ చివరి వరకు పట్టు సడలకుండా కవితను నడిపించారు. స్వరాలు లయమై రాగమై చక్రవాకమై అని అనడం ద్వారా నిరీక్షణకు సంబంధించిన విషాదాన్ని ఆమె కవితలో రూపుకట్టినట్లు భావించవచ్చు. చక్రవాక పక్షిలా ఎదురు చూడడంలోని విషాద మాధుర్యాన్ని ఆమె పలికించారు.

మూడో స్టాంజాను, ఐదో స్టాంజాను అన్వయించుకుంటే ఈ కవితలోని సామంజస్యం అర్థమవుతుంది. బాధ ఉధృతమై కట్టు తెగి/ గొంతులోకి ప్రవహించి/ స్వరపేటికను చుట్టుముట్టి/ అక్కడ గడ్డ కట్టేస్తుంది/ అంతటితో పాట ఆగిపోతుంది అని దాన్ని ఐదో స్టాంజాకు అనుసంధానం చేస్తూ రెండు పాదాలు రాసి గొంతును పూడ్చిన బాధ ఊరక ఉండదు/ కరిగి కన్నీటి పరమై/ చెంపలపై కురుస్తుంది అని చెబుతారు. తద్వారా ఒక అమూర్త భావన తాలూకు ప్రతిస్పందన మూర్త రూపంలో బయటపడడాన్ని ఆమె తన కవితలో వ్యక్తీకరించారు. రాగానిదీ ప్రయాణమే/ అదీ ఓ జీవితమే అంటూ జీవితానికి, రాగానికీ అభేదం చెబుతారు. ఏమైనా, భావనాత్మక ప్రపంచంలోకి తీసుకుని వెళ్తున్నట్లే కవిత ప్రారంభమై భౌతిక ప్రపంచంలోకి ప్రయాణం చేస్తుంది.

- కాసుల ప్రతాపరెడ్డి

Kavisangamam poet: Jyothirmai Malla poem

పాటకి గొంతు పుట్టిల్లు
స్వరాలు లయమై రాగమై చక్రవాకమై
గానమై నాదమై
గాలిలో మిళితమైతే న్యాయమే
లోలోపలికి పాకి ఆత్మను తాకి
గుండెను కదిలించి
పేరుతెలియని బాధనేదో పుట్టించడం అన్యాయం

గుండె గోడలెంత బలహీనమో
ఇట్టే పగిలి పోతాయి

బాధ ఉధృతమై కట్లు తెగి
గొంతులోకి ప్రవహించి
స్వరపేటికను చుట్టుముట్టి
అక్కడ గడ్డకట్టేస్తుంది
అంతటితో పాట ఆగిపోతుంది

రాగానికెంత బలమో
ఇట్టే బంధించేస్తుంది

గొంతును పూడ్చిన బాధ ఊరక ఉండదు
కరిగి కన్నీటి వర్షమై
చెంపలపై కురుస్తుంది

రాగానిదీ ఓ ప్రయాణమే
అదీ ఒక జీవితమే

- జ్యోతిర్మయి మళ్ళ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+