కవిస్వరం: సాహిర్ భారతి 'ప్రశ్న -1'

ఖాదర్ మొహియుద్దీన్ పుట్టుమచ్చ కవిత రాసినప్పుడు చాలా దుమారమే చెలరేగింది. అలాగే, స్కైబాబ వంటి నల్లగొండ ముస్లిం కవులు కవితాస్త్రాలను మత వివక్ష గురించి మాట్లాడినప్పుడు కూడా చాలా మంది నొసలు చిట్లించారు. దేశంలోని ముస్లింలు తమ దేశభక్తిని ఎప్పటికప్పుడు చాటుకోవాల్సిన ఆగత్యం ఏర్పడింది. కొన్ని సంఘటనల కారణంగా, ఇస్లాం ఉగ్రవాద చర్యల వల్ల ప్రతి ముస్లిం పౌరుడూ అదనపు భారాన్ని మోయాల్సిన దుస్థితిలో పడ్డాడు.

తాజాగా, సాహిర్ భారతి కవిసంగమంలో ప్రశ్నలు సంధించి వదిలిపెట్టడమే కాదు, మతం కారణంగా తనపై ఎక్కువపెట్టిన వివక్షను ప్రశ్నిస్తున్నాడు. కవి ప్రశ్న -1 అన్నాడు. అతని వద్ద ఇంకా చాలా ప్రశ్నలే మిగిలి ఉన్నట్లున్నాయి. ప్రేమించడానికి అడ్డం కాని మతం కుటుంబంలో కలుపుకోవడానికి ఎందుకు ఆటంకమవుతుందనే ప్రశ్నను సంధిస్తున్నాడు.

Kavisngamam poet: Sahir Bharati Prashna 1

తమ తండ్రి మతం వేరైనా దేశరక్షణ కోసం నిలబడుతాడని చెబుకున్నాడు. ఓ ప్రేమ కవితను సాహిర్ భారతి దేశంలో తన అస్తిత్వం ఏమిటనే స్థాయికి తీసుకుని వెళ్లాడు. సమస్య వ్యక్తిగతమైందే అయినప్పటికీ దాన్ని సార్వజనీనం చేయడంలో అతను విజయం సాధించాడు. జీవితంలో ప్రేమ వైఫల్యం అనేది మతం కారణంగా, కులకారణంగా జరుగుతూ ఉండేదే. మతాలు, కులాల సరిహద్దు రేఖలను దాటి జీవితాలను పెనవేసుకున్నవాళ్లున్నారు. అందుకు పోరాటం కావాలి. వ్యక్తిగత జీవితంలో కన్నా సామాజిక జీవితంలో అది పెద్ద సమస్యగా మారడం ఉన్నదే. అయితే, వైఫల్యాలను అనుభవాలుగా తీసుకుని, విజయాలకు దారులు వేసుకోవచ్చు. ప్రేమ వైఫల్యం, ప్రేమ కవితలకు సర్వసాధారణమైన వస్తువులు. అయితే, దాని నుంచి ఓ సార్వజనీన

సత్యాన్ని ఆవిష్కరించడంలో సాహిర్ భారతి కవిత విజయం సాధించింది. దానివల్ల అది చర్చనీయాంశంగా మారింది. కవితలో మంచి ప్రతీకలు కూడా ఉన్నాయి. నా కన్నీటిని నీ కనుబొమ్మలతో ఆపి..., ప్రేమలో నేర్చుకున్న ఓనమాలు.. వంటివి కవితకు సృజనాత్మకమైన పరీమళాన్ని అద్దాయి.

- కాసుల ప్రతాపరెడ్డి

నువ్వూ నేను ఒక జట్టు అని
నా బాటలో నీ పాదం వొంపి ....
నా కన్నీటిని నీ కను బొమ్మలతో ఆపి ..
నేను మరిచిన చిరునవ్వుని తిరిగి పరిచయం చేసావు......
ఈ నవ్వు నాతో ఉండేలా నీ ఏడు అడుగులు నాతో జత కట్టమంటే
మన మతాలు వేరని ...
ప్రేమలో నేర్చుకున్న ఓనమాలు దేనికి పనికి రావని
ముందు తన ప్రశ్నలకి జవాబులు వెతకమంది ..
ఆ క్షణం నాకు తట్టిన మొదటి ప్రశ్న......
నాలో ప్రవహించే రక్తపు బొట్టు తన రంగుది కాదా .......
కింద పడితే నేను "అమ్మా" అని అరవనా . ....
నా చెల్లి తో నేను రాఖీ కట్టించు కోనా ......
తన కుటుంబంలో వుండే ఆప్యాయత నా కుటుంబంలో వుండదా..........
ఎదుటి వాని ఆకలి తీర్చేటప్పుడు తనలా నా మనసు ఆలోచించదా . .........
మా నాన్న దేశ క్షేమం కోసం సరిహద్దులలో నిలబడితే తన నాన్నగారు నిలబడరా ........
ఎంత ఆలోచించినా
ఏడు అడుగులు నడవటానికి....
కలిసి బతకడానికి .....
మనసుల కలయిక కన్నా
ఏడు లైనులలో ప్రింట్ చేసిన కాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు అవసరమో అని నా ఆలోచనకి అందట్లేదు

- సాహిర్ భారతి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+