Amazon Layoffs: ఈ రెండు మెసేజ్ లతో 14 వేల మందిని తీసేసిన అమెజాన్..!

ప్రపంచవ్యాప్తంగా ఏఐ దూకుడు కారణంగా ఉద్యోగాలు ఆవిరైపోతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా 14 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ఇచ్చేసింది. ఇప్పటికే భారత్ లో టీసీఎస్ తో పాటు ఇతర దిగ్గజ సంస్థలు వరుసగా లేఆఫ్ లు ప్రకటిస్తున్నాయి. అమెరికాలో సైతం ప్రఖ్యాత కంపెనీలు సైతం లేఆఫ్ ల బాటలోనే ఉన్నాయి. అయితే ఇలాంటి సమయంలో అమెజాన్ 14 వేల మందిని తొలగించడం ఆశ్చర్యం కలిగించకపోయినా తీసేసిన తీరు మాత్రం షాకిచ్చింది.

అమెజాన్ తాజాగా 14 వేల మంది ఉద్యోగుల్ని సాగనంపేందుకు రెండు రకాల మెసేజ్ లు పంపింది. తెల్లవారుజామున ఉద్యోగులు నిద్రలేచే సరికి ఆ మెసేజ్ లు వారికి ఫోన్ లలో కనిపించాయి. అంతే వారు ఒక్కసారిగా షాకయ్యారు. ఇన్నాళ్లూ తాము పని చేసిన సంస్థ ఒక్కసారిగా ఇలా షాకింగ్ మెసేజ్ పంపడం వారిని అవాక్కయ్యేలా చేసింది. దీంతో ఆ రెండు మెసేజ్ లపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

Amazon Layoffs Staff Dismissed with Sudden Early Morning Text Alerts

బిజినెస్ ఇన్‌సైడర్ ప్రకారం అమెజాన్ బాధిత ఉద్యోగులకు నిమిషాల వ్యవధిలో రెండు టెక్స్ట్ సందేశాలు వచ్చాయి. మొదటిది ఆఫీసుకు వెళ్లే ముందు వారి వ్యక్తిగత లేదా కార్యాలయ ఇమెయిల్‌ను చూసుకోమని కోరింది. రెండవది మీ ఉద్యోగం గురించి ఈ-మెయిల్ అందకపోతే హెల్ప్ డెస్క్ నంబర్‌ను సంప్రదించాలని కోరింది. ఈ మెసేజ్ లు, ఈ-మెయిల్ నోటిఫికేషన్‌ల తర్వాత వెంటనే పంపినట్లు తెలుస్తోంది. తొలగించిన ఉద్యోగుల బ్యాడ్జ్ లు డీయాక్టివేట్ చేయడం ద్వారా వారు విషయం తెలియక ఆఫీసులకు వచ్చి ఇబ్బందులు పడకుండా ఈ మెసేజ్ లు పంపింది.

Amazon Layoffs Staff Dismissed with Sudden Early Morning Text Alerts

ఇలా ఉద్యోగుల్ని టెక్స్ట్ మెసేజ్ లు పంపి తీసేయడం అమెజాన్ తో పాటు ఇతర సంస్ధల్లోనూ చర్చనీయాంశంగా మారింది. మారుతున్న కార్పోరేట్ సంస్ధల ధోరణికి ఇది అద్దం పట్టింది. గూగుల్, టెస్లా వంటి ప్రధాన టెక్ సంస్థలలో కనిపిస్తున్న తాజా మార్పుకు ఇది నిదర్శనంగా చెప్తున్నారు. అమెజాన్ ఇలా సడన్ లేఆఫ్ నిర్ణయం తీసుకోవడం వల్ల ఉద్యోగులు, సంస్ధలో ఎలాంటి గందరగోళ లేకుండా ఇలా మెసేజ్ లు పంపినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+