1984లోనే నాసా వినూత్న ప్రయోగం.. అంతరిక్షంలోనూ తేనెపట్టు

ఈ భూమిపై ఉండే సమస్త జీవులకు గురుత్వాకర్షణ శక్తే మూలాధారం. నడక నుంచి ఎగరడం వరకు ప్రతీదీ భూమి ఆకర్షణ శక్తి ఆధారంగానే జరుగుతుంది. మరి అలాంటి గురుత్వాకర్షణ శక్తి అస్సలు లేని అంతరిక్షంలో తేనెటీగలు బతకగలవా? అసలు భూమిపై కట్టినట్లే అక్కడ కూడా తేనెపట్టును నిర్మించగలవా? ఈ వింత సందేహానికి సమాధానం కనుగొనేందుకు నాసా 1984లోనే ఒక వినూత్న ప్రయోగానికి తెరలేపింది. అంతరిక్షంలో తేనెటీగల ప్రవర్తనను పరిశోధించేందుకు ఏకంగా వేలాది ఈగలను రాకెట్లో ఎక్కించి నింగిలోకి పంపించింది.

నాసా ప్రయోగించిన 'స్పేస్ షటిల్ డిస్కవరీ' వ్యోమనౌక ద్వారా 3,301 తేనెటీగలు అంతరిక్షంలోకి అడుగుపెట్టాయి. వాటితో పాటు ఒక రాణి ఈగను కూడా ప్రత్యేకంగా తయారు చేసిన బాక్సుల్లో ఉంచారు. నాసా శాస్త్రవేత్తలు వీటి ఆహారం కోసం చక్కెర, నీరు కలిపిన ప్రత్యేక మిశ్రమాన్ని సిద్ధం చేశారు. ప్రయోగం మొదలైన కొత్తలో గురుత్వాకర్షణ లేకపోవడంతో తేనెటీగలు తీవ్రంగా ఇబ్బంది పడ్డాయి. ఎగరడానికి ప్రయత్నిస్తూ గాలిలో తేలిపోతూ, బాక్సు గోడలను ఢీకొడుతూ అయోమయానికి గురయ్యాయి.

Historic Space Experiment NASA Sent 3 301 Bees to Microgravity and Built Honeycombs in 1984
గ్రహాల లిస్టులో లేకున్నా సంచలనాలే... ప్లూటోపై బయటపడ్డ కొత్త ద్రవం!
గ్రహాల లిస్టులో లేకున్నా సంచలనాలే... ప్లూటోపై బయటపడ్డ కొత్త ద్రవం!

అంతరిక్షంలోనూ తేనెపట్టు నిర్మాణం

అయితే 7 రోజుల ఈ సుదీర్ఘ ప్రయాణంలో తేనెటీగలు ఊహించని విధంగా స్పందించాయి. కొద్ది రోజులకే అంతరిక్ష వాతావరణానికి అలవాటుపడి తేలిగ్గా ఎగరడం మొదలుపెట్టాయి. కేవలం ఎగరడమే కాదు.. నింగిలో సుమారు 200 సెంటీమీటర్ల పొడవైన తేనెపట్టును కూడా నిర్మించి శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచాయి. భూమిపై కంటే అంతరిక్షంలో కట్టిన తేనెపట్టు అరల గోడలు కాస్త మందంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

రాత్రివేళ కాంతులీనుతున్న భారతవని.. రెండు కళ్లు చాలని అద్భుత దృశ్యం!: Video
రాత్రివేళ కాంతులీనుతున్న భారతవని.. రెండు కళ్లు చాలని అద్భుత దృశ్యం!: Video

దిగ్బంధాన్ని దాటి నింగిలో విజయం

మిషన్ చివర్లో రాణి ఈగ సుమారు 35 గుడ్లను కూడా పెట్టింది. నాసా వ్యోమనౌక సురక్షితంగా భూమిపైకి తిరిగి వచ్చిన తర్వాత మెజారిటీ తేనెటీగలు సజీవంగానే ఉన్నాయి. గురుత్వాకర్షణ శక్తి లేకపోయినా జీవులు తమ జీవన శైలిని మార్చుకుని మనుగడ సాగించగలవని ఈ ప్రయోగం నిరూపిం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+