Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రూ. 7,499కే లావా BOLD N1 5G.. ఫీచర్స్ అదుర్స్ !

బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు శుభవార్త. భారత్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ తయారీ సంస్థ లావా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. తక్కువ బడ్జెట్‌లో అధునాతన ఫీచర్లతో ఫోన్‌ను లాంఛ్ చేసింది. Bold N1 5G మోడల్‌ను అధికారికంగా విడుదల చేసింది. "Made in India" బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకుంటుంది లావా. ఈ కొత్త స్మార్ట్ ఫోనుకి సంబంధించి పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా...

లావా Bold N1 5G ఫీచర్లు..

ధర & వేరియంట్లు..

  • ఈ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది.
  • 4GB RAM + 64GB స్టోరేజ్ - రూ. 7,499
  • 4GB RAM + 128GB స్టోరేజ్ - రూ. 7,999

ప్రస్తుతం విక్రయాలు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఎర్లీ డీల్స్ ద్వారా జరుగుతున్నాయి. అదనంగా SBI క్రెడిట్/డెబిట్ కార్డులతో రూ. 750 డిస్కౌంట్ లభిస్తుంది.

lava-bold-n1-5g-price-and-specifications-details

డిస్‌ప్లే..

  • లావా Bold N1 5Gలో
  • 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే (1612×720 పిక్సెల్స్)
  • 90Hz రిఫ్రెష్ రేట్
  • 20:9 యాస్పెక్ట్ రేషియో
  • ఈ కాంబినేషన్ వినియోగదారులకు సాఫ్ట్ స్క్రోలింగ్, స్మూత్ విజువల్ అనుభవాన్ని ఇస్తుంది.

ప్రాసెసర్ & పనితీరు..

  • ఈ ఫోన్‌లో UNISOC T765 (6nm) ఆక్టా-కోర్ SoC ఉంది.
  • 2x Cortex A76 (2.3GHz)
  • 6x Cortex A55 (2.1GHz)
  • Mali-G57 MC2 GPU గ్రాఫిక్స్ కోసం
  • రోజువారీ టాస్కులకు సరిపడే స్థిరమైన పనితీరును అందిస్తుంది.

ఆపరేటింగ్ సిస్టమ్..

  • Android 15 తో ఈ ఫోన్ లాంచ్ కావడం ప్రత్యేకత.
  • వినియోగదారులకు 1 Android OS అప్‌డేట్
  • 2 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లు లభిస్తాయి.

స్టోరేజ్..

  • 4GB LPDDR4x RAM (అదనంగా 4GB వర్చువల్ RAM సపోర్ట్)
  • 64GB/128GB స్టోరేజ్ ఆప్షన్స్
  • మైక్రోSD కార్డు ద్వారా 1TB వరకు విస్తరించుకోవచ్చు.

కెమెరా..

  • రియర్ కెమెరా - 13MP ప్రైమరీ లెన్స్ + LED ఫ్లాష్, 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్
  • ఫ్రంట్ కెమెరా - 5MP
  • సాధారణ ఫోటోగ్రఫీ, వీడియో కాలింగ్ అవసరాలకు సరిపోతుంది.

బ్యాటరీ & ఛార్జింగ్..

  • 5000mAh బ్యాటరీ
  • 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
  • బాక్స్‌లో మాత్రం 10W ఛార్జర్ మాత్రమే అందించబడింది.

భద్రత & డ్యూరబిలిటీ..

  • సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్
  • IP54 రేటింగ్ (డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెంట్)

కనెక్టివిటీ ఫీచర్లు..

  • 5G SA/NSA, 4G VoLTE సపోర్ట్
  • Wi-Fi 802.11 ac
  • Bluetooth 5.0
  • GPS + GLONASS
  • USB Type-C పోర్ట్
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+