రూ. 20వేల లోపు బెస్ట్ ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఇవే..!
ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగింది. చిన్నా-పెద్దా అనే తేడా లేకుండా అందరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్స్ కనిపిస్తున్నాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు తక్కువ ధరల్లోనే మంచి ఫీచర్లతో ఫోన్లను లాంచ్ చేస్తున్నాయని పలు కంపెనీలు. ప్రస్తుతం మార్కెట్లో రూ.6,000 నుంచి రూ.10,000 మధ్యలోనే మంచి ఫోన్‌లు దొరుకుతున్నా, ఇంకా మెరుగైన పనితీరు, కెమెరా, బ్యాటరీ లైఫ్, డిస్‌ప్లే కోసం కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే రూ.20,000 లోపు అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్లలో మూడింటి వివరాలు మీకోసం ప్రత్యేకంగా...
నథింగ్ ఫోన్ 2A..
ఈ ఫోన్ ప్రత్యేకత ఏమిటంటే, దీని బ్యాక్ ప్యానెల్‌లో ప్రత్యేక లైటింగ్ డిజైన్ ఉంటుంది. ఇది మార్కెట్లో ఒక నూతన ప్రయోగంగా గుర్తింపు పొందుతోంది.
ధర: రూ.18,999 (ప్రారంభ వేరియంట్)
డిస్‌ప్లే: 6.77 అంగుళాల Full HD+ AMOLED
ప్రాసెసర్: MediaTek Dimensity 7200 Pro
స్టోరేజ్: 8GB/12GB RAM + 128GB/256GB UFS 2.2
కెమెరా: 50MP ప్రైమరీ + 50MP అల్ట్రా వైడ్, 32MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 5,000mAh, 33W ఫాస్ట్ ఛార్జింగ్
ఇతర లక్షణాలు: Nothing OS, లైట్ వెయిట్ డిజైన్, ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్

రియల్‌మీ P3..
యువతలో ఎక్కువ మంది రియల్‌మీ ఫోన్లను ప్రిఫర్ చేస్తున్నారు. మంచి ఫీచర్లు, స్టైలిష్ డిజైన్, ఫాస్ట్ పనితీరు ఈ ఫోన్ హైలైట్స్.
ధర: రూ.16,999 (6GB + 128GB వేరియంట్)
డిస్‌ప్లే: 6.67 అంగుళాల Full HD+ AMOLED
ప్రాసెసర్: Snapdragon 6 Gen 4
కెమెరా: 50MP ప్రైమరీ + 2MP డెప్త్, 16MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 6,000mAh, 45W ఫాస్ట్ ఛార్జింగ్
ఇతర ఫీచర్లు: 120Hz రిఫ్రెష్‌రేట్, 5G సపోర్ట్, పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్
వన్‌ప్లస్ నార్డ్ CE4 లైట్..
వన్‌ప్లస్ ఫోన్లకు ప్రీమియం ఫీల్ ఉంటుంది. CE సిరీస్‌లో వచ్చిన ఈ ఫోన్ బడ్జెట్‌లో మంచి ఫీచర్లను అందిస్తోంది.
ధర: రూ.19,999 (8GB + 128GB వేరియంట్)
డిస్‌ప్లే: 6.67 అంగుళాల Full HD+ AMOLED, 120Hz రిఫ్రెష్‌రేట్
ప్రాసెసర్: Qualcomm Snapdragon 695
కెమెరా: 50MP ప్రైమరీ + 2MP డెప్త్, 16MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 5,500mAh, 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్
ఇతర ఫీచర్లు: Oxygen OS, IP54 రేటింగ్, స్టీరియో స్పీకర్లు
మరిన్ని బడ్జెట్ ఫోన్ల వివరాలు..
ఈ ఫోన్లతో పాటు
iQOO Z9 5G - రూ.19,999
Samsung Galaxy M14 5G - రూ.13,490
Poco X5 5G - రూ.15,999
రూ.20,000 లోపు మీరు కోరుకునే ఫీచర్లపై ఆధారపడి సరైన ఫోన్ ఎంపిక చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications