Astronauts Video:వ్యోమగామికి హెల్త్ ఎమర్జెన్సీ..అంతరిక్షం నుంచి అత్యవసర తరలింపు..!!

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి నలుగురు వ్యోమగాములు అనూహ్య రీతిలో భూమికి తిరిగి వచ్చారు. షెడ్యూల్ కంటే ముందే వీరు తిరిగి రావడం వెనుక ఉన్న 'మెడికల్ ఎమర్జెన్సీ' ఇప్పుడు అంతరిక్ష వర్గాల్లో చర్చనీయాంశమైంది.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. నలుగురు వ్యోమగాములతో కూడిన బృందం గురువారం తెల్లవారుజామున సురక్షితంగా భూమికి చేరుకుంది. స్పేస్-ఎక్స్ (SpaceX) కు చెందిన క్రూ డ్రాగన్ ( క్యాప్సూల్‌లో ప్రయాణించిన వీరు, శాన్ డియాగో సమీపంలోని పసిఫిక్ సముద్రంలో విజయవంతంగా ల్యాండ్ అయ్యారు.

medical-emergency-forces-astronauts-to-leave-space-station-crew-returns-safely-to-earth

ఎందుకు ముందే వచ్చారు?
వాస్తవానికి ఈ బృందం వచ్చే నెలలో తిరిగి రావాల్సి ఉంది. కానీ, గత వారం ఒక వ్యోమగామికి ఆరోగ్య సమస్య తలెత్తడంతో నాసా (NASA) వారిని వెంటనే వెనక్కి తీసుకురావాలని నిర్ణయించింది. దీనిని నాసా అధికారులు "నియంత్రిత వైద్య తరలింపు" (Controlled Medical Evacuation) గా పేర్కొన్నారు. ISS చరిత్రలో ఇలా వైద్య కారణాల వల్ల వ్యోమగాములను అర్ధాంతరంగా వెనక్కి తీసుకురావడం గత 25 ఏళ్లలో ఇదే మొదటిసారి.

తిరిగి వచ్చిన వ్యోమగాములు వీరే:
ఈ మిషన్‌లో మొత్తం 167 రోజుల పాటు అంతరిక్షంలో గడిపిన నలుగురు సభ్యులు:

  1. జెనా కార్డ్‌మన్ (నాసా - అమెరికా)
  2. మైఖేల్ ఫింక్ (నాసా - అమెరికా)
  3. కిమియా యుయ్ (JAXA - జపాన్)
  4. ఒలేగ్ ప్లాటోనోవ్ (రోస్కాస్మోస్ - రష్యా)

తిరుగు ప్రయాణం సాగిందిలా..
బుధవారం సాయంత్రం 5:20: అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమగాములు అన్‌డాక్ (విడిపోవడం) అయ్యారు.గురువారం తెల్లవారుజామున 2:51 గంటలకు కక్ష్య నుంచి భూమి వైపు ప్రయాణించేందుకు థ్రస్టర్లను మండించారు.తెల్లవారుజాము 3:41 గంటలకు పారాచూట్ల సాయంతో పసిఫిక్ సముద్రంలో ల్యాండ్ అయ్యారు.ఉదయం 4:30 గంటలకు వ్యోమగాములు క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చారు. అందరూ క్షేమంగానే ఉన్నట్లు ప్రాథమిక సమాచారం.

అంతరిక్షంలో వైద్యం సాధ్యమేనా?
అంతరిక్షంలో చిన్నపాటి అనారోగ్య సమస్యలకు అక్కడి ఫస్ట్ ఎయిడ్ కిట్ సరిపోతుంది. కానీ, తీవ్రమైన శస్త్రచికిత్స అవసరమైనా లేదా ప్రాణాపాయ స్థితిలో ఉన్నా వెంటనే భూమికి తీసుకురావడం తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే జీరో గ్రావిటీలో ఆపరేషన్ చేయడం, రక్తాన్ని నియంత్రించడం అసాధ్యం. ఆ అనారోగ్యానికి గురైన వ్యోమగామి వివరాలను గోప్యత కారణంగా నాసా వెల్లడించలేదు.ఈ మిషన్ విజయవంతంగా ముగియడంతో నాసా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+