మునగ గింజల పవర్ చూశారా?

మన ఇళ్లలో సాధారణంగా వాడే మునగకాయలకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. నీటిని శుద్ధి చేయడంలో మునగ విత్తనాలు రసాయనాలకు మించి పనిచేస్తాయని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. బ్రెజిల్‌లోని సావో పాలో స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు జరిపిన ఈ అధ్యయనంలో.. మునగ విత్తనాల సారం నీటిలో కలిసిపోయి ఉండే అతి సూక్ష్మమైన ప్లాస్టిక్ కణాలను (Microplastics) వేరు చేయడంలో అద్భుతంగా పనిచేస్తున్నట్లు తేలింది.

సాధారణంగా మున్సిపల్ నీటి శుద్ధి ప్లాంట్‌లలో నీటిని క్లీన్ చేయడానికి 'అల్యూమినియం సల్ఫేట్' వంటి రసాయనాలను వాడుతుంటారు. ఇవి ప్లాస్టిక్ కణాలను గడ్డకట్టించి నీటి నుంచి వేరు చేస్తాయి. అయితే, మునగ విత్తనాల నుండి తీసిన సారం (Saline Extract) కూడా సరిగ్గా ఇదే పనిచేస్తోందని, కొన్ని సందర్భాల్లో కెమికల్స్ కంటే మెరుగ్గా ఫలితాలను ఇస్తోందని పరిశోధకులు గమనించారు. ముఖ్యంగా ఉప్పు లేదా క్షార గుణం ఎక్కువగా ఉన్న నీటిలో మునగ విత్తనాలు మొనగాడిలా పనిచేస్తున్నాయట.

Moringa Seeds for Clean Water Scientists Discover a Natural Way to Remove Harmful Microplastics in 2026

ఎలా పనిచేస్తుంది?

నీటిలో ఉండే మైక్రోప్లాస్టిక్ కణాలు ఒకదానికొకటి అంటుకోకుండా వికర్షించుకుంటూ ఉంటాయి. అందుకే వాటిని వడపోయడం కష్టం. కానీ మునగ విత్తన సారాన్ని నీటిలో కలిపినప్పుడు, అది ఆ ప్లాస్టిక్ కణాల మధ్య ఉండే అయస్కాంత శక్తి లాంటి ఛార్జ్‌ను తొలగిస్తుంది. ఫలితంగా ఆ ప్లాస్టిక్ కణాలన్నీ ఒకదానికొకటి అతుక్కుని పెద్ద గడ్డలుగా మారుతాయి. అప్పుడు ఇసుక ఫిల్టర్ల ద్వారా ఆ నీటిని పంపినప్పుడు, ప్లాస్టిక్ గడ్డలన్నీ ఇసుకలో చిక్కుకుపోయి స్వచ్ఛమైన నీరు బయటకు వస్తుంది.

Drumstick Leves: మునగ ఆకు, విత్తనాలతో ఎన్ని ఉపయోగాలో తెలుసా..!
Drumstick Leves: మునగ ఆకు, విత్తనాలతో ఎన్ని ఉపయోగాలో తెలుసా..!

ప్రాణాంతక పీవీసీ (PVC) కి విరుగుడు..

మనుషుల ఆరోగ్యానికి అత్యంత హానికరమైన పీవీసీ (PVC) ప్లాస్టిక్ కణాలను కూడా మునగ విత్తనాలు సమర్థవంతంగా తొలగిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణ ఫిల్టర్లలో దొరకని ఈ ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. మునగ విత్తనాలు ఏమాత్రం ఖర్చు లేకుండా, ఎటువంటి విషపూరిత అవశేషాలను వదలకుండా నీటిని క్లీన్ చేయడం ఒక విప్లవాత్మక మార్పుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.

పల్లీలు తిన్న వెంటనే నీరు తాగుతున్నారా? ప్రమాదంలో మీ ఆరోగ్యం!
పల్లీలు తిన్న వెంటనే నీరు తాగుతున్నారా? ప్రమాదంలో మీ ఆరోగ్యం!

గ్రామీణ ప్రాంతాలకు వరం..

ఈ పద్ధతిని ఇంట్లోనే లేదా చిన్న చిన్న గ్రామాల్లో తక్కువ ఖర్చుతో అమలు చేయవచ్చు. రసాయన కోగ్యులెంట్లు వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయనే ఆందోళన పెరుగుతున్న తరుణంలో, మునగ విత్తనాలు ఒక సురక్షితమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి. పర్యావరణానికి మేలు చేస్తూనే, మన ఆరోగ్యానికి రక్షణ కవచంలా మునగ నిలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+