అదిరిపోయే ఫీచర్లతో మరో ఫోల్డబుల్‌ ఫోన్‌ లాంఛ్ చేసిన " మోటోరొలా "..

ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో తక్కువ ధరలోనే ఫోన్లను అందించేందుకు కంపెనీలు సైతం పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ మోటోరోలా మరో కొత్త ప్రీమియం ఫోన్‌ను భారతీయ మార్కెట్‌లో విడుదల చేసింది. మరో ఫోల్డబుల్‌ ఫోన్‌ను దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. 'రేజర్‌ 60' పేరిట లాంచ్‌ చేసింది. ప్రీమియం రేంజ్ లో రాబోతున్న ఈ ఫోన్ రూ.50 వేల లోపు బడ్జెట్‌లో తీసుకురావడం మొబైల్ ప్రియులను ఆకర్షిస్తోంది. ఈ ఫోన్ ఫీచర్స్, ధర గురించి మీకోసం ప్రత్యేకంగా...

MOTOROLA RAZER 60 ఫీచర్లు..

మోటోరోలా ఫోల్డబుల్‌ ఫోన్‌ 'రేజర్‌ 60' ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు శక్తివంతమైన స్పెసిఫికేషన్లతో మార్కెట్‌లోకి వచ్చింది.

motorola-razer-60-specifications-and-price-details

డిస్‌ప్లే..

6.9 అంగుళాల Full HD+ pOLED LTPO మైన డిస్‌ప్లేతో ఇది అందుబాటులో ఉంది. ఈ ప్రధాన డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్‌ రేట్, 3000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ కలిగి ఉంటుంది. అలానే ఔటర్‌ డిస్‌ప్లే 3.63 అంగుళాల pOLED డిస్‌ప్లే కాగా, 90Hz రిఫ్రెష్‌ రేట్, 1700 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ కలిగి ఉంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ సిరామిక్ ప్రొటెక్షన్ వలన ఫోన్‌ స్క్రీన్‌ రక్షణలో కూడా మెరుగ్గా ఉంటుంది.

ప్రాసెసర్..

ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400X చిప్‌సెట్ ఇవ్వబడింది. ఇది అధునాతన పనితీరు, గేమింగ్, మల్టీటాస్కింగ్‌ కు అత్యంత తక్కువ పవర్‌ వినియోగంతో సహాయపడుతుంది. Android 15 ఆధారిత Hello UI తో ఫోన్‌ పనిచేస్తుంది, ఇది క్లీన్‌, లైట్‌వెయిట్‌ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది.

కెమెరా..

కెమెరా పరంగా చూస్తే, 50MP ప్రధాన కెమెరా, 13MP అల్ట్రా వైడ్‌ లెన్స్‌, 32MP సెల్ఫీ కెమెరా ఇవ్వడం విశేషం. కొత్తగా అందించిన AI ఇమేజ్ టూల్స్, నైట్ మోడ్, పోర్ట్రెయిట్ ఎన్‌హాన్స్‌మెంట్స్ వంటి ఫీచర్లు ఫొటోగ్రఫీని కొత్త స్థాయికి తీసుకెళతాయి.

బ్యాటరీ..

ఫోన్‌ 4,700mAh బ్యాటరీ కలిగి ఉండగా, 30W టర్బో ఛార్జింగ్‌ సపోర్ట్‌తో వేగంగా ఛార్జ్ చేయవచ్చు. దీని వలన రోజు పొడవునా బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది.

motorola-razer-60-specifications-and-price-details

కనెక్టివిటీ, సెక్యూరిటీ..

IP48 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెన్స్, వర్షపు చినుకులు, తేమ వాతావరణంలోనూ గ్యాడ్జెట్‌ సురక్షితంగా పనిచేస్తుంది. అంతే కాకుండా కనెక్టివిటీ పరంగా Bluetooth 5.4, Wi-Fi 6, USB Type-C పోర్ట్, NFC, 5G సపోర్ట్ వంటి ఆధునిక ఫీచర్లు లభిస్తున్నాయి.

స్టోరేజ్, ధర..

ఈ ఫోన్ 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే లభ్యమవుతుంది. ధర రూ.49,999 గా నిర్ణయించారు.

సేల్స్..

జూన్ 4 నుంచి ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. మోటోరోలా అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ సహా ప్రముఖ రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్‌ కొనుగోలు చేయొచ్చు. సేల్స్ ప్రారంభంలో ప్రత్యేక డిస్కౌంట్లు, ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్లు కూడా ఉండే అవకాశముందని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+