7000mAh బ్యాటరీతో రియల్‌మీ 15T.. ఫీచర్స్ అదుర్స్ !
యల్‌మీ.. తక్కువ సమయంలోనే భారత మార్కెట్‌లో టాప్ బ్రాండ్లలో ఒకటిగా ఎదిగింది. భారీ బ్యాటరీ లైఫ్, ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన డిస్‌ప్లేలు, బెస్ట్ కెమెరాతో రియల్‌మీ ఫోన్లు యూత్‌కి బాగా కనెక్ట్ అవుతున్నాయి. యువతరానికి దగ్గరైన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా రియల్‌మీకి ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా రియల్‌మీ 15T అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారతీయ మార్కెట్లోకి తీసుకువస్తోంది.
రియల్‌మీ 15T లాంచ్..
రియల్‌మీ 15T ను సెప్టెంబర్ 2 మధ్యాహ్నం 12 గంటలకు భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేయనుంది. రూ. 20,000 లోపు ధరలో లభించనున్న ఈ ఫోన్, తన విభాగంలో గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందని రియల్‌మీ ప్రకటించింది.

Realme 15T ఫీచర్స్..
డిజైన్ & బిల్డ్ క్వాలిటీ..
- 7.79మి.మీ సన్నని బాడీ, కేవలం 181 గ్రాముల తేలికైన బరువు.
- 7000mAh భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ అల్ట్రా స్లిమ్ డిజైన్.
- టెక్స్చర్డ్ మ్యాట్ 4R డిజైన్ - ఫింగర్‌ప్రింట్ రెసిస్టెంట్, యాంటీ-స్లిప్.
- ఫ్లోయింగ్ సిల్వర్ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది.
- నానో-స్కేల్ మైక్రోక్రిస్టలైన్ లిథోగ్రఫీ టెక్నాలజీతో ప్రీమియం ఫినిష్.
డిస్‌ప్లే..
- 93% స్క్రీన్-టు-బాడీ రేషియో.
- 4000 nits పీక్ బ్రైట్‌నెస్ కలిగిన 4R కంఫర్ట్+ AMOLED స్క్రీన్.
- 10-బిట్ కలర్ డెప్త్, 1.07 బిలియన్ హ్యూస్ సపోర్ట్.
- 2160Hz PWM డిమ్మింగ్ - కళ్లకు హెల్తీ వ్యూయింగ్ అనుభవం.
బ్యాటరీ & ఛార్జింగ్..
- 7000mAh టైటాన్ బ్యాటరీ - పూర్తి రోజు బ్యాకప్.
- హాఫ్ ఛార్జ్‌తో సాయంత్రం వరకు సులభంగా వాడుకోవచ్చు.
- 10W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ - ఇతర డివైజ్‌లను కూడా ఛార్జ్ చేయవచ్చు.
- స్లిమ్ డిజైన్ అయినప్పటికీ, ఫ్లాగ్‌షిప్‌లను మించి లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ.
కెమెరా ఫీచర్లు..
- సెగ్మెంట్-ఫస్ట్ డ్యూయల్ 50MP AI కెమెరా సిస్టమ్ (ఫ్రంట్ & రియర్ రెండింటిలో).
- హై-రిజల్యూషన్ ఫోటోగ్రఫీకి ప్రత్యేకంగా డిజైన్.
- AI ఎడిట్ జెనీ - ప్రొఫెషనల్ స్థాయి ఫోటో ఎడిటింగ్ అనుభవం.
సేఫ్టీ..
- IP66, IP68, IP69 రేటింగ్‌లు - డస్ట్, వాటర్, స్పిల్స్ నుండి సంపూర్ణ రక్షణ.
- హెవీ యూజ్, లాంగ్ గేమింగ్ సెషన్స్‌కి ప్రత్యేక ఎయిర్‌ఫ్లో VC కూలింగ్ సిస్టమ్.
పనితీరు..
- గేమింగ్, మల్టీటాస్కింగ్‌కి ఫ్లూయిడ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే ప్రాసెసర్.
- రియల్‌మీ సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్‌తో వేగవంతమైన యూజర్ ఇంటర్‌ఫేస్. (లాంచ్ సమయంలో పూర్తి వివరాలు బయటపడతాయి)
ధర..
రూ. 20,000 లోపు ధరలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
రియల్‌మీ 15T తన విభాగంలో స్లిమ్ డిజైన్, భారీ బ్యాటరీ, అద్భుతమైన డిస్‌ప్లే, సెగ్మెంట్‌లోనే ఫస్ట్ డ్యూయల్ 50MP కెమెరా వంటి ఫీచర్లతో బెస్ట్-ఇన్-క్లాస్ స్మార్ట్‌ఫోన్ గా రాబోతుంది. ఈ స్పెసిఫికేషన్లు ఉండడం వల్ల యువతను బాగా ఆకర్షించే అవకాశం ఉందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications