కేవలం రూ.10 వేలకే.. 6000 బ్యాటరీతో రియల్‌మీ 5జీ ఫోన్ !
యువతలో రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లకు మంచి ఆదరణ ఉంది. టాప్-క్లాస్ కెమెరా ఫీచర్లు, శక్తివంతమైన ప్రాసెసర్లు, పొడవైన బ్యాటరీ లైఫ్‌తో పాటు ఆకర్షణీయమైన డిజైన్ తో తక్కువ బడ్జెట్ తో ఫోన్లు అందిస్తుంది. అందుకే టెక్ ప్రియులు ఈ బ్రాండ్ ఫోన్లను ప్రత్యేకంగా ఇష్టపడుతున్నారు. భారత మార్కెట్‌లో రియల్‌మీకి స్థిరమైన ఫ్యాన్ బేస్ ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఈ క్రేజ్‌కు కొనసాగింపుగా, ప్రముఖ మొబైల్ బ్రాండ్ రియల్‌మీ (Realme) మరోసారి బడ్జెట్ సెగ్మెంట్‌లో హాట్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే నార్జో 80 ఎక్స్, నార్జో 80 ప్రో మోడళ్లతో మార్కెట్‌ను ప్రభావితం చేసిన రియల్‌మీ.. ఇప్పుడు కొత్తగా నార్జో 80 లైట్ (Narzo 80 Lite) పేరిట 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ధర పరంగా చూస్తే ఇది అత్యంత పోటీగా ఉంది, ఫీచర్ల పరంగా చూస్తే ఇది యువతను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందనే చెప్పాలి.

realme Narzo 80 Lite ఫీచర్లు..
డిస్‌ప్లే..
6.67 అంగుళాల HD+ IPS LCD ప్యానెల్
120Hz రిఫ్రెష్ రేట్, 625 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ - స్క్రోల్ చేయడంలో స్మూత్ అనుభవం
పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా డిజైన్
ప్రాసెసర్, OS..
ఆక్టాకోర్ MediaTek Dimensity 6300 5G చిప్‌సెట్ - మంచి పనితీరు, పవర్ ఎఫిషియెన్సీ
Android 15 ఆధారిత Realme UI 6.0
ఇందులో Google Gemini AI ఇంటిగ్రేషన్ - గవాసం ఇంటెలిజెంట్ ఫీచర్లు, పర్సనలైజ్డ్ ఫంక్షనాలిటీ
కెమెరా..
ప్రధాన కెమెరా: 32MP AI ప్రైమరీ కెమెరా
ఫీచర్లు: AI Imaging, AI Clear Mode, HDR, నైట్ మోడ్, పోర్ట్రయిట్ మోడ్
సెల్ఫీ కెమెరా: 8MP - ఫేస్ బ్యూటిఫికేషన్, ఫిల్టర్స్ సపోర్ట్
బ్యాటరీ & ఛార్జింగ్..
6,000mAh బ్యాటరీ - రెండు రోజులు సులభంగా బాటరీ బ్యాకప్
15W ఫాస్ట్ ఛార్జింగ్ - Type-C పోర్ట్
5W రివర్స్ ఛార్జింగ్ - ఇతర డివైస్‌లను ఛార్జ్ చేయవచ్చు
డిజైన్ & డ్యూరబిలిటీ..
లైట్‌వెయిట్ డిజైన్ - 7.94 మిల్లీమీటర్ల మందం, 197 గ్రాముల బరువు
IP64 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెంట్ - రోజువారీ వాడకానికి బాగుంటుంది
సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ కూడా అందుబాటులో
వేరియంట్లు & ధరలు..
4GB RAM + 128GB స్టోరేజ్ - ₹10,499
6GB RAM + 128GB స్టోరేజ్ - ₹11,499
ప్రారంభ ధరలపై ₹700 వరకూ డిస్కౌంట్ లభ్యమవుతోంది
కలర్స్..
క్రిస్టల్ పర్పుల్
ఒనిక్స్ బ్లాక్
అదనపు ఫీచర్లు..
వర్చువల్ RAM ఎక్స్‌పాంశన్: 6GB వేరియంట్‌లో అదనంగా 6GB వరకు వర్చువల్ RAM జోడించుకోవచ్చు
డ్యుయల్ 5G SIM సపోర్ట్
వైఫై 5, బ్లూటూత్ 5.3, GPS, GLONASS, Beidou వంటి కనెక్టివిటీ ఆప్షన్లు
1TB వరకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ మైక్రో SD కార్డ్ ద్వారా
జూన్ 23 నుంచి అమెజాన్‌లో ప్రత్యేకంగా విక్రయాలు ప్రారంభం కానున్నాయి. తొలుత ఫ్లాష్ సేల్ ద్వారా విక్రయాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. పెద్ద స్క్రీన్, పవర్‌ఫుల్ బ్యాటరీ, AI కెమెరా ఫీచర్లు, 5G కనెక్టివిటీ వంటి అంశాలతో ఇది టెక్ ప్రియులను ఆకర్షిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications