Redmi నుంచి కొత్త ఫోన్స్ లాంఛ్.. ఎంతంటే ?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థలు సైతం కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్స్ ని రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా షావోమి సంస్థ రెడ్‌మీ బ్రాండ్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ లను చైనా మార్కెట్లో విడుదల చేసింది. రెడ్‌మీ నోట్ 15 ప్రో , రెడ్‌మీ నోట్ 15 ప్రో ప్లస్ ఫోన్లను తాజాగా విడుదల చేసింది.
ఈ ఫోన్‌లలో 7,000mAh పెద్ద బ్యాటరీ, IP68 వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్, హై-ఎండ్ ప్రాసెసర్లు ఉన్నాయి. ఫోన్‌లలో అధిక రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేలు, అధునాతన కెమెరా సెటప్‌లు, ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాలు వంటివి కూడా టెక్ ప్రియులను ఆకర్షిస్తున్నాయి. త్వరలోనే భారత్ లో కూడా రిలీజ్ చేస్తారని సమాచారం. ఇక ఈ ఫోన్ లకు సంబంధించిన మరిన్ని వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

Redmi Note 15 Pro & Redmi Note 15 Pro Plus ఫీచర్లు..
ధర..
రెడ్‌మీ నోట్ 15 ప్రో ప్లస్:
12GB + 256GB: 1,899 యువాన్ (భారత్ లో రూ.23,000)
12GB + 512GB: 2,099 యువాన్ (భారత్ లో రూ.25,000)
16GB + 512GB: 2,299 యువాన్ (భారత్ లో రూ.28,000)
రెడ్‌మీ నోట్ 15 ప్రో:
8GB + 256GB: 1,399 యువాన్ (భారత్ లో రూ.17,000)
12GB + 256GB: 1,599 యువాన్ (భారత్ లో రూ.20,000)
12GB + 512GB: 1,799 యువాన్ (భారత్ లో రూ.22,000)
రంగులు..
రెడ్‌మీ నోట్ 15 ప్రో ప్లస్ : సీడార్ వైట్, మిడ్‌నైట్ బ్లాక్, స్కై బ్లూ, స్మోకీ పర్పుల్ రంగుల్లో లభిస్తుంది.
రెడ్‌మీ నోట్ 15 ప్రో : సీడార్ వైట్, క్లౌడ్ పర్పుల్, మిడ్‌నైట్ బ్లాక్, స్కై బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది.
డిస్‌ప్లే & డిజైన్..
- రెడ్‌మీ నోట్ 15 ప్రో+ 6.83 అంగుళాల మైక్రో-కర్వ్డ్ డిస్‌ప్లేతో వస్తుంది.
- 1.5K రిజల్యూషన్ (1280×2772 పిక్సెల్స్)
- 120Hz రిఫ్రెష్ రేట్
- 480Hz టచ్ శాంప్లింగ్ రేట్
- 3,200 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.
- డిస్‌ప్లే షియోమీ డ్రాగన్ క్రిస్టల్ గ్లాస్ ప్రొటెక్షన్‌తో రక్షించబడింది.
- రెడ్‌మీ నోట్ 15 ప్రో కూడా అదే డిస్‌ప్లే సాంకేతికత, సైజ్, మరియు ఫీచర్లను కలిగి ఉంది.
ప్రాసెసర్ & పెర్ఫార్మెన్స్..
రెడ్‌మీ నోట్ 15 ప్రో ప్లస్..
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జనరేషన్ 4 చిప్ పై నడుస్తుంది. ఇది 16GB LPDDR4X ర్యామ్, 512GB UFS2.2 స్టోరేజ్‌తో జత చేయబడింది.
రెడ్‌మీ నోట్ 15 ప్రో..
మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా చిప్‌సెట్ను ఉపయోగిస్తుంది. RAM/స్టోరేజ్ వేరియంట్‌లు 8GB/12GB RAM, 256GB/512GB స్టోరేజ్‌తో అందుబాటులో ఉన్నాయి.
కెమెరా వ్యవస్థ..
రెడ్‌మీ నోట్ 15 ప్రో ప్లస్:
ట్రిపుల్ రియర్ కెమెరా: 50MP లైట్ ఫ్యూజన్ 800, 50MP టెలిఫోటో, 8MP అల్ట్రా-వైడ్
ఫ్రంట్ కెమెరా: 32MP
రెడ్‌మీ నోట్ 15 ప్రో:
రియర్ కెమెరా: 50MP సోనీ LYT-600, 8MP అల్ట్రా-వైడ్ IMX355
ఫ్రంట్ కెమెరా: 20MP
రెడ్‌మీ నోట్ 15 ప్రో ప్లస్,ప్రో 5x జూమ్, NPU ఫీచర్స్, AI సపోర్ట్ వంటి ఫోటో & వీడియో ఫీచర్లను అందిస్తుంది.
బాటరీ & ఛార్జింగ్..
రెడ్‌మీ నోట్ 15 సిరీస్‌లో 7,000mAh పెద్ద బ్యాటరీ ఉంది.
రెడ్‌మీ నోట్ 15 ప్రో ప్లస్: 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్
రెడ్‌మీ నోట్ 15 ప్రో: 45W ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W రివర్స్ ఛార్జింగ్
రెండు ఫోన్లలో షావోమీ సర్జ్ P3 ఛార్జింగ్ చిప్, సర్జ్ G1 ఫ్యూయల్ గేజ్ చిప్ ఉన్నాయి.
కనెక్టివిటీ..
రెడ్‌మీ నోట్ 15 ప్రో+ & ప్రో:
5G, Wi-Fi 6, NFC, బ్లూటూత్ 5.4
GPS: గెలీలియో, గ్లోనాస్, బీడౌ
USB Type-C పోర్ట్
అదనపు ఫీచర్లు..
ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్IP68 రేటింగ్
వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్
సాటిలైట్ మెసేజింగ్ ఫీచర్..
సెల్యులర్ నెట్‌వర్క్ లేకుండా బీడౌ ద్వారా ఎమర్జెన్సీ మెసేజ్‌లను సపోర్ట్ చేస్తుంది
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications