వందేళ్లకు పైగా కొరుకుడుపడని కెమిస్ట్రీ మిస్టరీకి చెక్- వీరికి నోబెల్
నోబెల్ బహుమతుల ప్రకటనల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే మెడిసిన్, ఫిజిక్స్ రంగాల్లో విజేతల పేర్లు వెల్లడయ్యాయి. తాజాగా కెమిస్ట్రీలో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును ప్రకటించింది జ్యూరీ. జీవక్రియలకు సంబంధించిన అత్యంత సంక్లిష్టమైన రహస్యాన్ని ఛేదించినందుకు గాను హెన్రీ బీ కాన్, కెన్సో సోయ్ లను ఈ అత్యున్నత పురస్కారం వరించింది. శతాబ్ద కాలానికి పైగా సైంటిస్టులను వేధిస్తున్న హోమోచిరాలిటీ వెనుక ఉన్న మర్మాన్ని వీరిద్దరూ కనుగొన్నారు.
సాధారణంగా అమైనో ఆమ్లాలు వంటి అణువులు ఒకదానికొకటి వేర్వేరు రూపాల్లో ఉంటాయి. ఒకరకంగా దీన్ని అద్దంలో ఉండే ప్రతిబింబాలుగా అభివర్ణించవచ్చు. ఈ భూమిపై ఉన్న సకల జీవుల కణాల్లో ఉండే ప్రోటీన్లలో ఒకే ఒక్క ప్రతిబింబ రూపం మాత్రమే ఉంటుంది. జీవుల మనుగడకు కీలకమైన ఈ ఏకరూప వైవిధ్యాన్ని హోమోచిరాలిటీగా పిలుస్తారు. ల్యాబొరేటరీల్లో రసాయన చర్యలు జరిపినప్పుడు ఈ రెండు రూపాలు సమానంగా ఏర్పడినప్పటికీ.. జీవులలో మాత్రం ఒకటే ఎలా సాధ్యమవుతుందనేది శాస్త్రవేత్తలకు సుదీర్ఘకాలం పాటు ఒక పెద్ద చిక్కుముడిగా మిగిలిపోయింది.

ఈ మిస్టరీని ఛేదించారు.. హెన్రీ బీ కాన్, కెన్సో సోయ్. సైద్ధాంతిక పరిశోధనకు మాత్రమే పరిమితం కాలేదు. ఆధునిక ఔషధాల తయారీలో ఇదొక విప్లవాత్మక మార్పును తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. మందుల తయారీలో వాడే అణువులలోని ఒక ప్రతిబింబం మాత్రమే రోగాన్ని నయం చేయడానికి ఉపయోగపడుతుంది. అదే సమయంలో మరొక ప్రతిబింబం శరీరానికి హాని కలిగించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అవసరమైన గుణాలను కలిగివున్న ఒకే ఒక రిఫ్లెక్టివ్ జీన్ ను మాత్రమే కృత్రిమంగా సృష్టించడానికి ఈ ఆవిష్కరణలు పునాది వేశాయి.
ఈ సుదీర్ఘ పరిశోధనల ప్రస్థానం సరిగ్గా నాలుగు దశాబ్దాల కిందట.. అంటే 1986లో ఆరంభమైంది. హెన్రీ కాగన్ రసాయన చర్యలను నియంత్రించగల నూతన మార్గాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. దీని ద్వారా రెండు రూపాలలో ఒకటి మాత్రమే ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా రసాయన ప్రక్రియలను మార్చవచ్చని ఆయన నిరూపించారు. అప్పటివరకు రసాయన రంగంలో అసాధ్యమని భావించిన ఈ ప్రక్రియను కార్యాచరణలోకి తీసుకుని రావొచ్చని మొట్టమొదటిసారిగా నిర్ధారించగలిగారు.
దీని తర్వాత 1995 లో కెన్సో సోయి తరువాతి దశ పరిశోధనకు తెరతీశారు. రసాయన చర్యల్లో ఒకే ఒక ప్రతిబింబ రూప అణువును మాత్రమే ఆటోమేటిక్ గా అది కూడా శాశ్వతంగా సృష్టించే ప్రక్రియను ఆయన కనుగొన్నారు. 2003లో ఆయన ఈ ప్రయోగాన్ని విజయవంతంగా చేయగలిగారు. రిఫ్లెక్టివ్ జీన్ ను ను తయారు చేసిన ఘనతను సాధించారు.
BREAKING NEWSThe Royal Swedish Academy of Sciences has decided to award the 2026 #NobelPrize in Chemistry to Henri B. Kagan and Kenso Soai “for the discovery of non-linear effects and autocatalysis in asymmetric organic synthesis.” https://t.co/nH090ql1Xc
— The Nobel Prize (@NobelPrize) October 7, 2026
అవార్డుల ప్రకటన సందర్భంగా నోబెల్ కెమిస్ట్రీ కమిటీ చైర్మన్ హైనర్ లింకే మాట్లాడారు. ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు వంద సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న సవాల్ కు శాస్త్రీయ పరిష్కారాన్ని అందించారని పేర్కొన్నారు. జీవుల ఆవిర్భావంలో హోమోచిరాలిటీ ఎలా స్థిరపడిందో అర్థం చేసుకోవడానికి వీరిద్దరి ప్రయోగాలు కొత్త మార్గాన్ని చూపాయని స్పష్టం చేశారు. ఇది ఔషధాల తయారీలో ఓ విప్లవాత్మక మార్పునకు బాటలు వేస్తుందని వ్యాఖ్యానించారు.














Click it and Unblock the Notifications
