Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Hacking News: హైదరాబాద్ వాటర్ బోర్డు వెబ్‌సైట్ హ్యాక్.. దుండగుల చర్యతో బిత్తరపోయన గూగుల్‌

Hyderabad News: భారీగా పెరిగిపోతున్న సైబర్ నేరాలకు ప్రజలే కాకుండా ప్రభుత్వాలు కూడా బాధితులుగా మారుతున్నాయి. ప్రపంచం మొత్తం టెక్నాలజీలో తోపు అని గొప్పగా చెబుతున్న గూగుల్‌ను సైతం బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా జరిగిన ఓ వెబ్‌సైట్ హ్యాక్ తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఓ విభాగాన్ని ఇరుకున పెట్టింది.

తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన కేటుగాళ్లు గూగుల్ న్యూస్‌లో స్పామ్ లింక్స్ పోస్ట్ చేశారు. ఈ సైబర్ దాడి గూగుల్ న్యూస్ అల్గోరిథం‌ను దెబ్బతీసి టెక్నాలజీ సెక్షన్‌లో బెట్టింగ్, ఆన్లైన్ రమ్మీ, క్యాసినో సైట్లకు సంబంధించిన లింక్స్‌ కనిపించేలా చేసింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSS) వెబ్‌సైట్ 'hyderabadwater.gov.in' ఈ ఘటనలో బాధితురాలిగా మారింది. సైట్‌లోని భద్రతా లోపాలను హ్యాకర్లు ఎక్స్‌ప్లాయిట్ చేయడం ద్వారా ఇలా చేసినట్లు అర్థమవుతోంది.

Spammers hacked Hyderabad water board website and fooled google

హైదరాబాద్ వాసులు వాటర్ బిల్లులు చెల్లించేందుకు ఈ HMWSS వెబ్‌సైట్ ఉపయోగిస్తుంటారు. కాగా ఇది ఎప్పుడు హ్యాక్ అయిందో తెలియాల్సి ఉంది. ఆగంతకులు అనుమానాస్పద లింక్స్‌ను గూగుల్ న్యూస్‌లో ప్రత్యక్షమయ్యేలా చేశారు. ఇవి వినియోగదారులను ఆన్లైన్ బెట్టింగ్ సైట్స్ betwww20.com కు రీడైరెక్ట్ చేశాయి. కొన్ని సెకన్ల పాటు గరీనా, ఫ్రీ ఫైర్ మాక్స్ రీడీమ్ కోడ్స్‌కు సంబంధించిన కంటెంట్ చూపించాయి. తర్వాత మళ్లీ జూదం వెబ్‌సైట్ల లింక్స్ కనిపించాయి.

ఈ హ్యాక్ ప్రధానంగా SQLi అనే సాధారణ హ్యాకింగ్ పద్ధతిని ఉపయోగించి జరిగిందని నిపుణులు భావిస్తున్నారు. ఈ పద్ధతిలో హ్యాకర్లు సరైన భద్రతా తనిఖీలు లేని వెబ్‌సైట్ ఫీల్డ్స్‌లో SQL కోడ్ ఇంజెక్ట్ చేయడం ద్వారా డేటాబేస్ సమాచారానికి రీరూట్ చేస్తారు. HMWSS సైట్‌లోని ఈ భద్రతా లోపాలను అధిగమించేందుకు సరిగా చర్యలు తీసుకోకపోవడం వల్ల హ్యాకర్లకు ఈ దాడి సులభమైనట్లు చెబుతున్నారు.

SQL ఇంజెక్షన్స్ వల్ల కొన్నిసార్లు వినియోగదారుల డేటా భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం కూడా ఉంది. గూగుల్ న్యూస్ అల్గోరిథం కూడా ఈ స్పామ్ లింక్స్‌ను ట్రెండింగ్ కంటెంట్‌గా ప్రదర్శించడం వల్ల వీటి ప్రభావం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. దీంతో కేవలం HMWSS సైట్ మాత్రమే కాకుండా గూగుల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్‌కు కూడా మెరుగైన భద్రతా చర్యల అవసరాన్ని ఎత్తిచూపుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+