దీపావళికి కారు కొంటున్నారా? ఈ టాప్ 5 కార్లు సేఫ్టీలో బెస్ట్!
Cars With ADAS in India Under 20 Lakhs: జీఎస్టీ తగ్గింపుతో పాటు పండుగ డిస్కౌంట్ల నేపథ్యంలో కార్ల ధరలు తగ్గిన సంగతి తెలిసిందే. దీపావళి వంటి పండుగ సీజన్‌లో కొత్త కారు కొనడం శుభంగా భావిస్తారు. ఈ పండుగ వేళలో మీరు కూడా బెస్ట్ సేఫ్టీ ఉన్న కొత్త కొనాలని ప్లాన్ చేస్తున్నారా?. అయితే ఈ వార్త మీ కోసమే. డ్రైవర్ భద్రతను పెంచి ప్రమాదాలను తగ్గించే అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్ ఇటీవల కాలంలో చాలా ప్రజాదరణ పొందింది. ఈ ఫీచర్ ఉన్న కార్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ టెక్నాలజీ డ్రైవర్ భద్రతను పెంచడంతో పాటు రోడ్డు ప్రమాదాలను చాలా వరకు తగ్గిస్తుంది. రూ.20 లక్షల(ఎక్స్-షోరూమ్)లోపు ADAS ఫీచర్‌తో లభించే టాప్-5 కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. మహీంద్రా XUV3XO
మహీంద్రా నుంచి వచ్చిన XUV3XO తన సెగ్మెంట్‌లో అత్యధిక ఫీచర్లు ఉన్న ఎస్‌యూవీగా పేరు తెచ్చుకుంది.
*ADAS లెవెల్: లెవెల్ 2 ADAS
*వేరియంట్లు: AX5 L, AX7 L
*ఇంజిన్ ఎంపికలు: 1.2-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్
*ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర (ADAS వేరియంట్): రూ.11.50 లక్షలు.

2. హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta)
భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మిడ్-సైజ్ ఎస్‌యూవీలలో హ్యుందాయ్ క్రెటా ఒకటి. దీనిని కూడా లెవెల్ 2 ADAS ఫీచర్‌తో అప్‌డేట్ చేశారు.
*ADAS లెవెల్: లెవెల్ 2 ADAS
*వేరియంట్లు: SX Tech, SX(O)
*ఇంజిన్ ఎంపికలు: 1.5-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్
*ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర (ADAS వేరియంట్): రూ.15.69 లక్షలు
3. మారుతి విక్టోరియస్ (Maruti Victorious)
మారుతి సుజుకి నుంచి ADAS టెక్నాలజీని పొందిన తొలి కారు విక్టోరియస్.
*ADAS లెవెల్: లెవెల్ 2 ADAS
*వేరియంట్లు: కేవలం ZXi+ AT ట్రిమ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.
*ఇంజిన్: 1.5-లీటర్ K15C మైల్డ్-హైబ్రిడ్ ఇంజిన్ (స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో ఈ ఫీచర్ లేదు).
*ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర (ADAS వేరియంట్): రూ.17.19 లక్షలు.
4. టాటా హారియర్ (Tata Harrier)
టాటా మోటార్స్ అడ్వాన్స్‌డ్ ఎస్‌యూవీ అయిన హారియర్ ఇప్పుడు మరింత అధునాతనంగా మారింది.
*ADAS లెవెల్: ADAS టెక్నాలజీ (లెవెల్ 1/లెవెల్ 2 స్థాయి వివరాలు పేర్కొనబడలేదు)
*వేరియంట్లు: Adventure X+, Fearless X+
*ఇంజిన్: 2.0-లీటర్ క్రయోటెక్ (Kryotec) డీజిల్ ఇంజిన్, 170hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
*ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర (ADAS వేరియంట్): రూ.18.30 లక్షలు
5. మహీంద్రా XUV700
భారత్‌లో ADAS టెక్నాలజీని ప్రవేశపెట్టిన తొలి ఎస్‌యూవీలలో మహీంద్రా XUV700 ఒకటి.
*ADAS లెవెల్: లెవెల్ 2 ADAS
*వేరియంట్లు: టాప్ మోడల్స్ అయిన AX7, AX7 L ట్రిమ్స్‌లో అందుబాటులో ఉంది.
*ఇంజిన్ ఎంపికలు: 2.2-లీటర్ mHawk డీజిల్, 2.0-లీటర్ mStallion పెట్రోల్ ఇంజిన్లు.
*ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర (ADAS వేరియంట్): రూ.18.37 లక్షలు












Click it and Unblock the Notifications