రూ.7 లక్షల బడ్జెట్‌లో టాప్ 5 కార్లు.. జీఎస్టీ తగ్గింపు తర్వాత ఎంత ఆదా అవుతుందో?
Cars Under 7 Lakhs: మన దేశంలో బడ్జెట్ కార్లకు డిమాండ్ ఎల్లప్పుడూ ఉంటుంది. దేశంలో చాలా వరకు మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో చాలా మంది తక్కువ బడ్జెట్‌లోనే మంచి కారు కొనుక్కోవాలని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఈ వార్త అలాంటి వారి కోసమే. భారత మార్కెట్లో రూ.7 లక్షల బడ్జెట్లో చాలా మంచి కార్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల జీఎస్టీ తగ్గింపు తర్వాత కార్ల కంపెనీలు తమ వాహనాల ధరలను తగ్గించాయి. దీని వల్ల బడ్జెట్ కార్లు మరింత సరసమైన ధరలకే లభిస్తున్నాయి. మీరు కూడా రూ.7 లక్షల కంటే తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉన్న కారు కొనాలనుకుంటే ఈ 5 పాపులర్ మోడళ్లు మీకు సరైన ఎంపికలు కావచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఓ లుక్కేయండి.
రూ.7 లక్షల లోపు కార్ల పూర్తి వివరాలు ఇవే..
1. మారుతి సుజుకి డిజైర్
మారుతి సుజుకికి చెందిన కాంపాక్ట్ సెడాన్ డిజైర్ కారు చాలా కాలంగా ప్రజలు మెచ్చిన కారుగా ఉంది. ఇది మంచి మైలేజ్, సౌకర్యవంతమైన డ్రైవింగ్, అద్భుత పనితీరుకు ప్రసిద్ధి చెందింది. జీఎస్టీ తగ్గింపు తర్వాత దీని ప్రారంభ ధర రూ.7 లక్షల కంటే తక్కువకు రావచ్చు. ఇది బడ్జెట్ కొనుగోలుదారులకు మరింత లబ్ధి చేకూర్చనుంది. మారుతి కార్లలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఈ కారు ధర జీఎస్టీ తగ్గింపు తర్వాత దాదాపు రూ.86,000 తగ్గింది. దీంతో ఈ కారును దాదాపు రూ.6 లక్షలకే కొనుగోలు చేయవచ్చు.

2. టాటా పంచ్
టాటా మోటార్స్ మైక్రో-ఎస్యూవీ టాటా పంచ్ భారత మార్కెట్లో త్వరగా ప్రజాదరణ పొందింది. ఈ కారు దృఢమైన బాడీ, 5-స్టార్ గ్లోబల్ ఎన్సీఏపీ సేఫ్టీ రేటింగ్, అధునాతన ఫీచర్లతో వస్తుంది. జీఎస్టీ తగ్గింపు తర్వాత దీనిని రూ.7 లక్షల కంటే తక్కువ ధరలో కొనుగోలు చేయవచ్చు. ఈ కారు జీఎస్పీ తగ్గింపు తర్వాత దాదాపు రూ.85,000 తక్కువ ధరలో లభిస్తుంది.
3. మారుతి సుజుకి స్విఫ్ట్
హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో మారుతి స్విఫ్ట్ ఎప్పుడూ మంచి అమ్మకాలు సాధించే కారుగా ఉంటుంది. ఇది స్పోర్టీ లుక్, మెరుగైన పిక్-అప్, అద్భుతమైన మైలేజ్‌కు పేరుగాంచింది. జీఎస్టీ తగ్గింపు తర్వాత దీని ధర కూడా తగ్గుతుంది. దీనిని కొనడం మరింత చౌకగా మారుతుంది. మారుతి సుజుకి స్విఫ్ట్‌ను రూ. 80,966 తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.
4. టాటా ఆల్ట్రోజ్
టాటా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ టాటా ఆల్ట్రోజ్ స్టైలిష్ డిజైన్, హై సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది. ఇది అద్భుతమైన స్పేస్, సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. రూ.7 లక్షల కంటే తక్కువ ధరలో లభించే ఈ కారుకు జీఎస్టీ తగ్గింపు తర్వాత డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ కారును జీఎస్‌టీ తగ్గింపు తర్వాత రూ. 1,10,000 తక్కువ ధరకు కొనవచ్చు.
5. నిస్సాన్ మాగ్నైట్
నిస్సాన్ కాంపాక్ట్ ఎస్యూవీ నిస్సాన్ మాగ్నైట్ తక్కువ ధర, ఫీచర్-లోడెడ్ ప్యాకేజ్‌తో ప్రసిద్ధి చెందింది. ఇందులో శక్తివంతమైన ఇంజిన్, ప్రీమియం ఇంటీరియర్, అధునాతన సాంకేతికత ఉంటాయి. రూ.7 లక్షల బడ్జెట్‌లో ఈ ఎస్యూవీ వినియోగదారులకు ఒక మంచి డీల్ కావచ్చు. జీఎస్టీ తగ్గింపు తర్వాత, దీని ధర వేరియంట్‌ను బట్టి రూ. 55,000 నుంచి రూ. 64,000 వరకు తగ్గుతుంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications