200 ఎంపీ కెమెరా, అదిరిపోయే ఫీచర్లతో Vivo X300, Vivo X300 Pro లాంఛ్..!

ప్రస్తుతం భారత మార్కెట్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్ల డిమాండ్ భారీగా పెరుగుతోంది. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Vivo ప్రపంచవ్యాప్తంగా ఫ్లాగ్‌షిప్ & మిడ్-రేంజ్ ఫోన్లతో మంచి మార్కెట్ సాధించింది. ఈ క్రమంలోనే అక్టోబర్ 13న Vivo అధికారికంగా Vivo X300 సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో Vivo X300, Vivo X300 Pro మోడల్స్ ఉన్నాయి.

ఈ ఫోన్లు ప్రపంచంలోనే తొలి MediaTek Dimensity 9500 SoC చిప్‌సెట్ ఆధారిత ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లుగా నిలిచాయి. ఈ చిప్‌సెట్ Snapdragon 8 Elite Gen 5తో పోటీ చేయగల సామర్థ్యం కలిగి ఉంది. చైనా లాంచ్ ఈవెంట్ అక్టోబర్ 13 సాయంత్రం 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం 4:30 pm) జరగగా.. భారత మార్కెట్లో Vivo X300 సిరీస్ వచ్చే నెలలో విడుదల అయ్యే అవకాశం ఉంది.

vivo-x300-vivo-x300-pro-price-and-specifications-details

Vivo X300 ఫీచర్లు..

డిస్‌ప్లే..

Vivo X300 6.31-ఇంచుల BOE Q10+ OLED LTPO డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 1.5K రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేటును సపోర్ట్ చేస్తుంది.

ప్రాసెసర్..

MediaTek Dimensity 9500 ప్రాసెసర్, 12GB RAM మరియు 256GB UFS 4.0 స్టోరేజ్ తో ఈ ఫోన్ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుంది.

కెమెరా..

200MP Samsung HPB ప్రధాన సెన్సార్, 50MP Samsung JN1 అల్ట్రా వైడ్, 50MP Sony LYT-602 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి.

50MP Samsung JN1 ఫ్రంట్ కెమెరా

బ్యాటరీ..

6,040mAh బ్యాటరీ, 90W వైర్డ్ చార్జింగ్.. 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.

డిజైన్..

ఫోన్ IP68 వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్, బరువు 190గ్రా, మందం 7.95mm. సాఫ్ట్‌వేర్ Android 16 ఆధారిత OriginOS 6.

vivo-x300-vivo-x300-pro-price-and-specifications-details

Vivo X300 Pro ఫీచర్లు..

డిస్‌ప్లే..

Vivo X300 Pro 6.78-ఇంచుల Round Micro-Curved BOE Q10+ డిస్‌ప్లేతో వస్తుంది. 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో పాటు, సర్క్యులర్ పోలరైజేషన్ 2.0ను కలిగి ఉండడం వల్ల ఎండలో కూడా స్పష్టమైన స్క్రీన్ వీక్షణ కల్పిస్తుంది.

కెమెరా..

X300 Pro మరింత అప్‌గ్రేడ్ చేశారు. 200MP Samsung HPB ప్రధాన సెన్సార్ వెనుక భాగంలో 50MP Sony LYT-828 ప్రధాన కెమెరా (OIS), 50MP Samsung JN1 అల్ట్రా వైడ్, 200MP Samsung HPB పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి.

ఫ్రంట్‌లో 50MP Samsung JN1 సెల్ఫీ కెమెరా. V1, V3+ ఇమేజింగ్ చిప్స్తో ఫోటోగ్రఫీ పనితీరు మరింత మెరుగైనది.

బ్యాటరీ..

6,510mAh బ్యాటరీ.. 90W వైర్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్

డిజైన్..

IP68 రేటింగ్, బరువు 226గ్రా, మందం 7.99mm.

అదనపు ఫీచర్లు..

ఈ రెండు ఫోన్లలో..

అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్

డ్యూయల్ స్పీకర్స్

X-అక్షం లీనియర్ మోటార్

Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, GPS

USB 3.2 టైప్-C పోర్ట్

ధర & వేరియంట్లు..

వివో X300 12GB+256GB వేరియంట్ ధరకు CNY 4,399 (సుమారు రూ.54,700) కు ప్రారంభమవుతుంది. 16GB+1TB టాప్ మోడల్ ధర CNY 5,799 (అంటే భారత కరెన్సీలో సుమారు రూ.72,900). ఇది ఫ్రీ బ్లూ, కంఫర్టబుల్ పర్పుల్, ప్యూర్ బ్లాక్ లక్కీ రంగుల్లో లభిస్తుంది.

వివో X300 ప్రో 12GB+256GB బేస్ మోడల్ కి CNY 5,299 (సుమారు రూ.65,900) కు ప్రారంభమవుతుంది. 16GB+1TB వేరియంట్ ధర CNY 6,699 (సుమారు రూ.83,300). శాటిలైట్ కమ్యూనికేషన్ ఎడిషన్ ధర CNY 8,299 (సుమారు రూ.1,03,200). ఇది వైల్డర్నెస్ బ్రౌన్, సింపుల్ వైట్, ఫ్రీ బ్లూ, ప్యూర్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+