బాబర్ ఆజమ్ కు అలా రాసిపెట్టుంది..!!

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. తొలుత బౌలింగ్, ఆ తర్వాత బ్యాటింగ్ లో ప్రతాపం చూపించింది. ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో ఆ జట్టును మట్టికరిపించింది. మూడు వన్డేల ఈ సిరీస్ ను 1-1తో సమం చేసింది. నేడు సిరీస్ డిసైడర్. లాహోర్ దీనికి వేదిక. రాత్రి 8:30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. సిరీస్ ఎవరిదో తేల్చే మ్యాచ్ కావడం వల్ల హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. చేతులెత్తేసింది. 19. ఓవర్లల్లో 110 పరుగులకే చాప చుట్టేసింది. టాప్ ఆర్డర్ బ్యాటర్ డెవాల్డ్ బ్రేవిస్ ఒక్కడే టాప్ స్కోరర్. 16 బంతుల్లో మూడు భారీ సిక్సర్లతో 25 పరుగులు చేశాడు. ఆ స్థాయిలో మరెవరూ రాణించలేకపోయారు. కేప్టెన్ డెనోవాన్ ఫెరీరా- 15, కార్బిన్ బోష్- 11, రెజా హండ్రిక్స్- 0, క్వింటన్ డికాక్- 7, టోనీ డి జోర్జి- 7, మాథ్యూ బ్రీట్జ్కె- 5, జార్జ్ లిండె- 9, ఓట్నెల్ బాట్మన్- 12, లుంగి ఎంగిడి- 7 పరుగులు చేశారు.

Babar Azam Shatters Rohit Sharma s T20Is Record

పాకిస్తాన్ బౌలర్లల్లో ఫహీం అష్రాఫ్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. 3.2 ఓవర్లల్లో 23 పరుగులు మాత్రమే ఇచ్చి దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ ను కుప్పకూల్చాడు. సల్మాన్ మీర్జా- 3, నసీం షా- 2, అబ్రార్ అహ్మద్ ఒక వికెట్ తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ ధాటిగా ఆడింది. 13.1 ఓవర్లల్లో ఒక వికెట్ నష్టానికి 112 పరుగులు అందుకుంది. ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్- 28, సయీం అయూబ్- 71 పరుగులతో కదం తొక్కారు. బాబర్ ఆజమ్- 11 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

ఈ కాసిన్ని పరుగులతో బాబర్ ఆజమ్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. క్రికెట్ చరిత్రలో తన పేరును లిఖించుకున్నాడు. టీ20 ఇంటర్నేషనల్స్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. 4,234 పరుగులు సాధించాడీ పాకిస్తాన్ మాజీ కేప్టెన్. ఈ క్రమంలో టీమిండియా మాజీ కేప్టెన్ రోహిత్ శర్మ రికార్డును బాబర్ అధిగమించాడు. టీ20 ఇంటర్నేషనల్స్ లో రోహిత్ శర్మ 4,231 పరుగులు చేశాడు. దీన్ని అధిగమించడానికి బాబర్ ఆజమ్ కు తొమ్మిది పరుగులు మాత్రమే అవసరం అయ్యాయి.

స్పిన్నర్ డోనోవన్ ఫెరీరా బౌలింగ్‌లో లాంగ్ ఆఫ్ దిశగా సింగిల్ తీసి బాబర్ ఈ రికార్డును సాధించాడు. దాదాపు ఏడాది తర్వాత బాబర్‌కు ఇది తొలి టీ20 సిరీస్. ఫఖర్ జమాన్ స్థానంలో అతన్ని జట్టులోకి తిరిగి తీసుకుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్. దక్షిణాఫ్రికాతో రావల్పిండిలో జరిగిన తొలి మ్యాచ్ లో రెండు బంతుల్లో డకౌట్ బాబర్. బాబర్ ప్రస్తుతం 130 టీ20 ఇంటర్నేషనల్స్ లల్లో 4,234 పరుగులు చేశాడు. ఇందులో 36 అర్ధ సెంచరీలు, 3 సెంచరీలు ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ 129. రోహిత్ శర్మ 159 మ్యాచ్‌లలో 4,231 పరుగులు చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+