IPL 2024 Winner: ఐపీఎల్ 2024 విజేత ఎవరో చెప్పేసిన డఫాబెట్.. !
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్ (ఐపీఎల్ 2024) ప్లే ఆఫ్ దశకు వచ్చేసింది. ఇవాళ తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనుంది. ఇందులో గెలిచే జట్టు ఫైనల్లోకి దర్జాగా అడుగుపెట్టనుంది. రేపు జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎదుర్కోనుంది. ఇందులో గెలిచే జట్టు మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఓడిన జట్టు ఇంటికెళ్తుంది. ఈ నేపథ్యంలో ఈసారి ఐపీఎల్ టైటిల్ ఎగరేసుకుపోయేది ఎవరన్న చర్చ జరుగుతోంది.
గతంలో జరిగిన టోర్నీలకు భిన్నంగా ఈసారి ఊహించని జట్లు ప్లేఆఫ్స్ కు చేరుకున్నాయి. అలాగే ఫైనల్ వరకూ ఇదే ఉత్కంఠ కొనసాగేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి టైటిల్ ఎగరేసుకుపోయే అవకాశం ప్లేఆఫ్ కు వచ్చిన నాలుగు జట్లకూ ఉందనే చర్చ జరుగుతోంది. అయితే ఇందులో ఎక్కువగా టైటిల్ గెల్చుకునే అవకాశం ఉన్న జట్టేదో ఆన్ లైన్ బెట్టింగ్ ప్లాట్ పామ్ డఫాబెట్ తేల్చిచెప్పేసింది.

ఐపీఎల్ 2024 టైటిల్ ను గెల్చుకునే అవకాశం ఇప్పటివరకూ పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకే ఉందని డఫాబెట్ అంచనా వేస్తోంది. అలాగే టైటిల్ ఎగరేసుకుపోయేందుకు అవకాశం ఉన్న రెండో జట్టుకు సన్ రైజర్స్ హైదరాబాద్ ను డఫాబెట్ అంచనా వేసింది. ఆ తర్వాత మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు, చివరిగా రాజస్థాన్ రాయల్స్ కు అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు వీరికి వరుసగా నాలుగు స్ధానాలు కేటాయించింది.












Click it and Unblock the Notifications