IND vs WI: స్కోర్ చెప్పేసిన దాదా.. చెమటలు చిందిస్తున్న టీమిండియా

కోల్‌కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్ ఇప్పుడు ఒక రణక్షేత్రాన్ని తలపిస్తోంది. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరగనున్న హై-వోల్టేజ్ పోరుకు ముందు ఇరు జట్లు నెట్స్‌లో చెమటోడుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ సారథి, 'దాదా' సౌరభ్ గంగూలీ పిచ్‌ను పరిశీలించి, ఇది 'హై స్కోరింగ్ మ్యాచ్' అవుతుందని సంకేతాలివ్వడంతో అభిమానుల్లో ఉత్కంఠ అంబరాన్నంటింది.

ఈడెన్ గార్డెన్స్ బౌండరీలు చిన్నవి కావడంతో, వెస్టిండీస్ పవర్ హిట్టర్లు రూథర్‌ఫర్డ్, షెఫర్డ్‌లు నెట్స్‌లో భారీ షాట్లతో విరుచుకుపడుతున్నారు. బంతి గాల్లోకి లేస్తే స్టాండ్స్‌లో పడాల్సిందే అన్నంత కసిగా వారు సాధన చేస్తున్నారు. దీనికి విరుగుడుగా టీమ్ ఇండియా బౌలింగ్ విభాగం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా జింబాబ్వే మ్యాచ్‌లో బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో, ఈసారి ఏమాత్రం పొరపాట్లకు తావివ్వకూడదని గంభీర్ సేన భావిస్తోంది.

Eden Gardens Ready for High-Scoring Thriller Team India Intensifies Practice to Tackle Windies Power Hitters

బుమ్రా రిథమ్.. గంభీర్ పర్యవేక్షణ:

నెట్స్‌లో జస్ప్రీత్ బుమ్రా ఏకాగ్రత అందరినీ ఆశ్చర్యపరిచింది. తన రిథమ్, లెంగ్త్‌ను పక్కాగా సెట్ చేసుకునేందుకు బ్యాటర్ లేకపోయినా నిరంతరాయంగా బంతులు విసురుతూ కనిపించాడు. మరోవైపు, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్వయంగా గైడ్ చేయడం విశేషం. టేపుతో కొలిచి మరీ నిర్ణీత లెంగ్త్‌లో బంతులు వేయాలని సూచిస్తూ, ఈడెన్ పిచ్‌ డైమెన్షన్లకు తగినట్లుగా తన వ్యూహాలను సిద్ధం చేయిస్తున్నాడు గౌతీ.

అభిషేక్ 'స్పిన్' పరీక్ష.. దూబే కసరత్తు:

యువ ఓపెనర్ అభిషేక్ శర్మ పవర్ ప్లేలో స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు ప్రత్యేక సెషన్‌లో పాల్గొన్నాడు. అటు తిలక్ వర్మ, ఇషాన్ కిషన్‌ల బ్యాటింగ్‌తో నెట్స్ దద్దరిల్లాయి. జింబాబ్వే మ్యాచ్‌లో నిరాశపరిచిన శివం దూబే, ఈసారి బంతితో కూడా సత్తా చాటాలని బౌలింగ్ సెషన్‌లో ఎక్కువ సమయం కేటాయించాడు. అక్షర్ పటేల్ కూడా వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్‌ల బౌలింగ్‌లో తన బ్యాటింగ్ పదును చూపిస్తూ ఆల్ రౌండ్ షోకు సిద్ధమయ్యాడు.

వాతావరణం అనుకూలం: రన్ రేట్ వర్షమేనా?

ఈడెన్ క్యూరేటర్ బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌ను సిద్ధం చేయడంతో, అభిమానులకు పరుగుల విందు ఖాయంగా కనిపిస్తోంది. వాతావరణం కూడా మ్యాచ్‌కు పూర్తి సహకారం అందించనుంది. ఆక్యూవెదర్ రిపోర్ట్ ప్రకారం వర్షం ముప్పు లేదు, సాయంత్రం వేళ ఆహ్లాదకరమైన 24-27 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండనుంది. అయితే రాత్రివేళ పెరిగే తేమ (తేమ శాతం 69% వరకు) టాస్ గెలిచిన జట్టు నిర్ణయంపై ప్రభావం చూపనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+