Champions Trophy 2025 Winnner: ఛాంపియన్స్ ట్రోఫీ వారిదే-శిఖర్ ధావన్ జోస్యం..!
ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ ఇవాళ ప్రారంభమైంది. గ్రూప్ ఏలో భాగంగా కరాచీలో జరుగుతున్న తొలి మ్యాచ్ లో ఆతిధ్య పాకిస్తాన్ తో న్యూజీలాండ్ జట్టు తలపడుతోంది. మార్చి9న జరిగే ఫైనల్ తో ఛాంపియన్స్ ట్రోఫీ ముగియనుంది. రెండు గ్రూపులుగా జరుగుతున్న ఈ టోర్నీలో టైటిల్ కోసం గట్టి పోటీయే ఉంది. ఇందులో భారత్ తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, కివీస్, ఇంగ్లండ్ వంటి జట్లు టైటిల్ రేసులో ఉన్నాయి. దీంతో టైటిల్ విజేతపై ఇప్పటికే ఊహాగానాలు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ అప్పుడే ఛాంపియన్స్ ట్రోఫీపై తన అంచనాను వెల్లడించాడు. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేత ఎవరో ధావన్ చెప్పేశాడు. టోర్నీలో మేటి జట్ల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని చెబుతూనే అన్ని ఫార్మాట్లలోనూ నిలకడగా రాణిస్తున్న భారత్ కే టైటిల్ గెల్చుకునే అవకాశాలు ఉన్నాయని ధావన్ జోస్యం చెప్పాడు. అందుకు గల కారణాలను కూడా గబ్బర్ తన ఇన్ స్టా పోస్టులో వెల్లడించాడు.

జస్ప్రీత్ బుమ్రా స్థానంలో టీమిండియాలోకి వచ్చిన పేస్ సంచలనం హర్షిత్ రాణా ఛాంపియన్స్ ట్రోపీలో అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తాడని ధావన్ అంచనా వేస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే అరంగేట్రంతో ఆకట్టుకున్న హర్షిత్ రాణా..దుబాయ్ లో భారత్ కు అవసరమైన వికెట్లు తీసి పెడతాడని ధావన్ జోస్యం చెప్పాడు. హర్షిత్ రాణా రాక జట్టుకు ఎంతో మేలు చేస్తుందన్నాడు. అతనికి ఇది బ్రేక్ అవుట్ టోర్నీ అవుతుందన్నాడు. సవాళ్లను స్వీకరించే మనస్తత్వం కలిగిన రాణా.. ఫామ్‌లో ఉన్నాడని తెలిపాడు. కాబట్టి అతను ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాడని ఖచ్చితంగా అనుకుంటున్నట్లు ధావన్ విశ్లేషించాడు.












Click it and Unblock the Notifications