IPL 2024: ఈ ఐపీఎల్ తర్వాత వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ రిటైర్మెంట్ !
ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ పలు సంచలనాలకు వేదికగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇది రికార్డుల పరంగా మాత్రమే కాకుండా పలువురు సీనియర్ ఆటగాళ్ల రిటైర్మెంట్ ల విషయంలో కావడం విశేషం. ఇప్పటికే టీమిండియాతో పాటు పలు జాతీయ జట్లలో సీనియర్ ఆటగాళ్లు ఐపీఎల్ ఆడేసి రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే క్రమంలో భారత వెటరన్ వికెట్ కీపర్ పేరు కూడా వినిపిస్తోంది.
అయితే ఇప్పటికే భారత వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరు రిటైర్మెంట్ విషయంలో వినిపిస్తుండగా.. మరో వెటరన్ వికెట్ కీపర్ కూడా ఈ జాబితాలో చేరారు. ఇప్పటికే కేకేఆర్, ఆర్సీబీ వంటి పలు జట్లకు కీపర్, బ్యాట్స్ మెన్ గా ఆడిన టీమిండియా వెటరన్ ఆటగాడు దినేష్ కార్తీక్.. ఈసారి ఐపీఎల్ సీజన్ ఆడేసి క్రికెట్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మేరకు క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

తాజా అంచనాల ప్రకారం దినేష్ కార్తీక్ ఈ ఏడాది తన చివరి ఐపీఎల్ సీజన్ ఆడబోతున్నాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభమయ్యాక ప్రతీ సీజన్ లోనూ ఆడిన ఏడుగురు ఆటగాళ్లలో ఒకరైన భారత సీనియర్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఈ సీజన్ ఆడేసి వీడ్కోలు ఇచ్చేందుకు కార్తీక్ సిద్ధమవుతున్నాడు. కార్తీక్ ప్రస్తుతం ఐపీఎల్ లీగ్ చరిత్రలో 4516 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ జాబితాలో పదో స్థానంలో ఉన్నాడు. అలాగే 242 మ్యాచ్‌లతో ఐపీఎల్ చరిత్రలో ఆడిన అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లలో ధోనీ (250), రోహిత్ శర్మ (243) తర్వాత మూడో స్ధానంలో ఉన్నాడు.












Click it and Unblock the Notifications