గంభీర్ కోచ్ కాలేడు, ఆ పాత్రే కరెక్ట్ ..! కపిల్ దేవ్ షాకింగ్..!

అంతర్జాతీయ క్రికెట్లో టెస్టు, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లలో ఆడుతున్న టీమ్ ఇండియా తాజాగా పలు వైఫల్యాలు ఎదుర్కొంది. ముఖ్యంగా స్వదేశంలో పాతికేళ్ల తర్వాత దక్షిణాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ వైట్ వాష్ ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో టీమ్ హెడ్ కోచ్ గౌతం గంభీర్ పాత్రపై విమర్శలు ఎక్కువయ్యాయి. కోచ్ గా గంభీర్ ను తప్పించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో భారత్ కు తొలి వరల్డ్ కప్ అందించిన దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ స్పందించాడు.

ఆధునిక క్రికెట్లో జట్టు హెడ్ కోచ్ పాత్ర మారిపోయిందని, క్రికెటర్లకు కోచింగ్ ఇవ్వడం కంటే వారిని మేనేజ్ చేయడమే అసలు బాధ్యత అని లెజండ్ కపిల్ దేవ్ తెలిపారు. ఇవాళ కోచ్ అనేది చాలా సాధారణ పదం అని, గౌతమ్ గంభీర్ కోచ్ కాలేడని తేల్చేశాడు. అతను జట్టుకు మేనేజర్ కావచ్చని తెలిపాడు. కోచ్ అంటే నేను స్కూల్, కాలేజీలో నేర్చుకునేది అన్నాడు. అక్కడి వ్యక్తులు, నా కోచ్‌లు. వారు నన్ను మేనేజ్ చేయగలరు అని పేర్కొన్నాడు.

Gambhir Can t Coach Kapil Dev Suggests New Role for Ex-India Star

లెగ్ స్పిన్నర్ అని ఎవరికైనా పేరు పెట్టినప్పుడు మీరు కోచ్ ఎలా అవుతారని గంభీర్ ను కపిల్ ప్రశ్నించాడు. గంభీర్.. లెగ్ స్పిన్నర్‌కి లేదా వికెట్ కీపర్‌కి కోచ్ ఎలా అవుతారని అడిగాడు. కాబట్టి ఆయన మేనేజ్ చేయాలని సలహా ఇచ్చాడు. మేనేజర్‌గా క్రికెటర్లకు గంభీర్ ప్రోత్సాహం ఇస్తాడన్నాడు. ఎందుకంటే ఆయన మేనేజర్ అయినప్పుడు క్రికెటర్లు గౌరవిస్తారని తెలిపాడు. తన మేనేజర్ లేదా కెప్టెన్ తనకు ఆ ఓదార్పును ఎలా ఇవ్వగలరని అడిగాడు. మేనేజర్, కెప్టెన్ పని అదే అన్నాడు.

Gambhir Can t Coach Kapil Dev Suggests New Role for Ex-India Star

జట్టుకు ఓదార్పు ఇవ్వడం అనేది గంభీర్ ఎప్పుడూ చేయగలడని కపిల్ తెలిపాడు. తాను దానిని అలాగే చూస్తానన్నాడు. కెప్టెన్‌గా తన సొంత సైకాలజీ.. ఆటగాళ్లు బలహీనత దశలో ఉన్నప్పుడు వారికి మద్దతు ఇవ్వడమే అన్నాడు. బాగా ఆడని వారికి మీరు ఓదార్పునివ్వాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఎవరైనా సెంచరీ చేస్తే, తాను అతనితో కలిసి మద్యం సేవించి భోజనం చేయాలనుకోవడం లేదని, కానీ బాగా ఆడని వారితో మాత్రం కలిసి భోజనం చేస్తానన్నాడు. కోచ్ వారికి ఆత్మవిశ్వాసం కల్పించాలని, అదే జరుగుతుందన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+