నటాషాకు దెబ్బకు భారీగా ఆస్తులు పొగొట్టుకున్న హార్దిక్ పాండ్యా..?

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషాకు విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించారు. తన సోషల్ మీడియా ద్వారా విడుకుల గురించి ఓ ప్రకటన చేశారు. ఇది తమకు చాలా కఠినమైన నిర్ణయమని పేర్కొన్నారు. ఇద్దరూ విడిపోయినా.. తమ మూడేళ్ల కొడుకు అగస్త్య బాధ్యతలను తల్లిదండ్రులుగా కొనసాగిస్తామని తెలిపారు. నటాషా సైతం విడాకులపై తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. మేము కలిసి ఉండేందుకు చాలా ప్రయత్నం చేసాము.

మా ఇద్దరికి ఇది కఠినమైన నిర్ణయమే.. కానీ మా ఇద్దరికీ ఇది మంచి ప్రయోజనం చేకూరుస్తుందని మేము నమ్ముతున్నాము. మేము కలిసి ఆనందించిన సమయం, పరస్పర గౌరవం, ఒక కుటుంబంగా ఎదిగాము. ఈ ప్రయాణాన్ని మేము సంతోషించాము. మా అబ్బాయి అగస్త్యకు మంచి కో పేరెంట్స్ గా ఉంటామని ఆమె తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. హార్దిక్ పాండ్యా హీరోయిన్ నటాషా స్టాంకోవిచ్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు.

Hardik Pandya lost a lot of property to Natasha

2020లో ఈ జంట వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందు రెండేళ్లు డేటింగ్ చేసిన వీరిద్దరు.. పెళ్లికి ముందే కమిట్ అయ్యారని తెలుస్తోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. హార్దిక్ పాండ్యా,నటాషా స్టాంకోవిచ్‌లు పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే నటాషా తల్లి కాబోతుందనే వార్త బయటకు వచ్చింది. ఇక పెళ్లి తర్వాత ఈ జంట తమ దాంపత్య జీవితాన్ని బాగానే ఎంజాయ్ చేశారు. అయితే ఇటీవల వీరి కాపురంలో విభేదాలు తలెత్తాయి.

హార్దిక్ పాండ్యా ,నటాషాల మధ్య అభిప్రాయభేదాలు రావడంతో వీరు విడాకులు బాట పట్టారు. నటాషాకు భరణం అధికంగా దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. నటాషా సెర్బియాకు చెందిన మహిళ కావడంతో భరణం అధికంగా అడిగే అకవాశాలు ఉన్నాయని న్యాయ నిపుణలు చెబుతున్నారు. హార్దిక్ పాండ్యా తన ఆస్తిలో 70 శాతం నటాషాకి ఇవ్వవలసి ఉంటుందని తెలుస్తోంది. ఈ కారణాలన్నింటి వల్లే పాండ్యా ఫ్యామిలీ ఈ విషయం గురించి ఎక్కడా మాట్లాడడం లేదని తెలుస్తోంది.

2024 లెక్కల ప్రకారం హార్దిక్ పాండ్యా నికర విలువ సుమారు రూ.91 కోట్లుగా అంచనా వేయబడింది. గ్రేడ్ A కేటగిరీ కింద బీసీసీఐ నుంచి ఏడాదికి అతను వార్షిక రూ. 5 కోట్లు తీసుకుంటున్నాడు. ఇక ఐపీఎల్ ద్వారా రూ. 15 కోట్ల వరకు తీసుకుంటున్నారని ఓ అంచనా.ఇటీవలి T20 ప్రపంచ కప్ విజయం కూడా అతని ఆదాయాన్ని మరింత పెంచింది. వడోదరలో విలాసవంతమైన ఇల్లుతో పాటు, రేంజ్ రోవర్ ,రోల్స్ రాయిస్ వంటి 8 ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. ఇవన్ని పరిగణలోకి తీసుకుంటే హార్దిక్ ఆస్తులు విలువ రూ. 120 కోట్ల వరకు ఉండవచ్చు. ఈ ఆస్తులన్నీ పరిగణలోకి తీసుకునే నటాషా హార్దిక్ నుంచి భారీ భరణం పొంది ఉంటుందని తెలుస్తోంది. అధికారికంగా దీనిపై లెక్కలు బయటకు రానప్పటికి, భరణం విలువ 30 నుంచి 40 కోట్ల వరకు ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+