హర్మన్‌ప్రీత్ చేసిన పనికి ఉలిక్కిపడిన జై షా! (వీడియో)
ICC Womens World Cup 2025: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ఫైనల్లో టీమిండియా దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. ప్రపంచ కప్ గెలిచిన తర్వాత భారత మహిళా క్రికెట్ జట్టు ఆటగాళ్లు ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అయితే చరిత్ర సృష్టించడమే కాకుండా.. తన స్టైల్లో అందరి దృష్టిని ఆకర్షించింది. గెలుపు అనంతరం ఆమె భావోద్వేగానికి లోనైంది. ఆ తర్వాత ట్రోఫీని అందుకునే ముందు భాంగ్రా నృత్యం చేస్తూ కనిపించింది. వీటన్నింటి తర్వాత భారత కెప్టెన్ తన సంస్కారాన్ని కూడా ప్రదర్శించి ఆ క్షణాలను కెమెరాలకు చిక్కేలా చేసింది.
జై షా పాదాలకు నమస్కరించిన హర్మన్‌ప్రీత్
ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత 36 ఏళ్ల హర్మన్‌ప్రీత్ కౌర్ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. విజయం సాధించిన వెంటనే హర్మన్‌ప్రీత్ మొదట హెడ్ కోచ్ అమోల్ మజుందార్ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకుంది. ఆ తర్వాత ట్రోఫీని అందుకోవడానికి స్టేజ్ వైపు వెళ్తున్నప్పుడు ఆమె భాంగ్రా చేస్తూ నడుచుకుంటూ వెళ్లింది. ఐసీసీ ఛైర్మన్ జై షా వద్దకు చేరుకోగానే హర్మన్‌ప్రీత్ తన సంస్కారాన్ని ప్రదర్శిస్తూ, క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆయన పాదాలను తాకి నమస్కరించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ ఇలా చేయడం చూసి జై షా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆమెను అలా చేయవద్దని వారించి గౌరవంగా తల వంచారు.

ట్రోఫీని అందుకున్న తర్వాత హర్మన్‌ప్రీత్ మళ్లీ తన జట్టు వైపు వెళ్తూ నృత్యం చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ 2009లో టీమిండియాలోకి అడుగుపెట్టింది. తన కెరీర్ చివరి దశలో జట్టుకు ప్రపంచకప్ అందించి, తన కలను సాకారం చేసుకుంది.
Just see the SANSKAR
— PallaviCT (@pallavict) November 2, 2025
Harmanpreet tried to TOUCH feet of Jay Shah but he REFUSED & in fact, BOWED to her as she’s Nari Shakti of Bharat 🇮🇳
Then he gave the trophy & LEFT the stage ASAP after the mandatory photos
Recall a leader who was pushed off the stage by the RUDE Aussies… pic.twitter.com/wjLpT6nS9R
హర్మన్‌ప్రీత్‌కు గెలుపు ఒక అలవాటు
టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టులో అనేక మార్పులు తీసుకువచ్చింది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో ముంబై ఇండియన్స్ జట్టుకు రెండుసార్లు కెప్టెన్‌గా వ్యవహరించి.. టైటిల్ సాధించి తనకు గెలవడం తెలుసని నిరూపించుకుంది. గత రెండేళ్లుగా హెడ్ కోచ్ అమోల్ మజుందార్‌తో కలిసి ఆమె ఈ జట్టును నిర్మించింది. ఈ విజయంలో హర్మన్‌ప్రీత్‌కు ప్రత్యేక ఘనత దక్కాలి. ఈ ప్రపంచకప్ విజయంతో హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ ప్రయాణం మరింత అద్భుతంగా, చిరస్మరణీయంగా మారింది.












Click it and Unblock the Notifications