ఆస్ట్రేలియా మెడ వంచారు..హైలైట్ అదే

భారత్ తో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ లో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో ఆస్ట్రేలియా తడబడింది. 236 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి రెండు వన్డేలను ఎగరేసుకెళ్లిన ఆస్ట్రేలియా బ్యాటర్లు.. ఈ మ్యాచ్ లో 50 ఓవర్లను కూడా పూర్తిగా ఆడలేకపోయిందంటే భారత బౌలర్లు ఏ స్థాయిలో చెలరేగారో అర్థం చేసుకోవచ్చు. ఈ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలను ఆ జట్టు బౌలర్లు ఎంత వరకు తీరుస్తారనేది రెండో ఇన్నింగ్ లో చూడొచ్చు.

టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగింది ఆస్ట్రేలియా. దూకుడుగా ఆడింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, మిఛెల్ మార్ష్ తొలి ఓవర్లల్లో దుమ్ము లేపారు. సగటున ఓవర్ కు ఆరు చొప్పున పరుగులను రాబట్టుకున్నారు. ఈ క్రమంలో క్రీజ్ లో పాతుకుపోయిన ఓపెనింగ్ జోడీ మహ్మద్ సిరాజ్ విడగొట్టాడు. ఆఫ్ స్టంప్స్ కు కాస్త దూరంగా వేసిన లెంగ్త్ డెలివరీని షాట్ ఆడాడు హెడ్. బ్యాక్ వర్డ్ పాయింట్ మీదుగా గాల్లోకి లేచిన ఆ బంతిని ప్రసిద్ధ్ అందుకున్నాడు. దీంతో 61 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.

Harshit Rana shines and Kohli takes a stunner Australia bowled out 236 vs India in 3rd ODI

ఆ తర్వాత కూడా వికెట్లు పెద్దగా దక్కలేదు. ఒకదశలో 33 ఓవర్లలో మూడు నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 183 పరుగులు సాధించింది. డెత్ ఓవర్లల్లో మరింత ధాటిగా ఆడుతుందని భావించారు. ఆ దశలో బౌలర్లు రెచ్చిపోయారు. హర్షిత్ రాణా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ తో అతను సంధించిన బంతులకు ఆసీస్ బౌలర్లు బేజారెత్తిపోయారు. 8.4 ఓవర్లు వేసిన హర్షిత్ రాణా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇది అతని కేరీర్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్.

ఆస్ట్రేలియా ఇన్నింగ్ లో మాట్ రెన్ షా, కేప్టెన్ మిఛెల్ మార్ష్ మాత్రమే రాణించారు. రెన్ షా హాఫ్ సెంచరీ చేశాడు. 58 బంతుల్లో రెండు ఫోర్లతో 56 పరుగులు కొట్టాడు. మార్ష్- 41, ట్రావిస్ హెడ్- 29, మాథ్యూ షార్ట్- 30, అలెక్స్ క్యారీ- 24, కూపర్ కొన్నొల్లి- 23, మిఛెల్ ఓవెన్- 1, మిఛెల్ స్టార్క్- 2, నాథన్ ఎల్లిస్- 16, ఆడమ్ జంపా- 2 (నాటౌట్) రన్స్ చేశారు.

విరాట్ కోహ్లీ పట్టిన క్యాచ్.. టీమిండియా ఇన్నింగ్ లో హైలైట్ గా చెప్పుకోవచ్చు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో మాథ్యూ షార్ట్ కొట్టిన స్వీప్ షాట్ ను అద్భుతంగా అందుకున్నాడు కోహ్లీ. షార్ట్ కొట్టిన బంతి మెరుపు వేగంతో తన వైపునకు దూసుకుని రాగా.. దాన్ని క్షణాల్లో క్యాచ్ పట్టాడు. ముఖం మీదుగా దూసుకొచ్చిన బంతిని మోకాళ్ల మీద కూర్చుని వెనక్కి వాలుతూ అందుకున్నాడు. ఓ క్విక్ క్యాచ్ అది. దీంతో 124 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది ఆసీస్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+