టెస్టులకు ముందు టీమిండియాకు దిమ్మతిరిగే షాక్.. మ్యాచ్ ఫీజులో 35 శాతం కోత!

IND vs NZ: న్యూజిలాండ్ గడ్డపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న ఆనందంలో ఉన్న భారత జట్టుకు టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే ఐసీసీ బిగ్ షాకిచ్చింది. కివీస్‌తో జరిగిన ఐదో వన్డేలో నిర్ణీత సమయానికి ఓవర్లను పూర్తి చేయకపోవడంతో(స్లో ఓవర్ రేట్) టీమిండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఏకంగా 35 శాతం కోత విధిస్తూ ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకుంది.

Ind Vs NZ Test: న్యూజీలాండ్ తో టెస్టులకు బౌలింగ్ ప్లాన్ మార్పు- గిల్ ప్రకటన..!
Ind Vs NZ Test: న్యూజీలాండ్ తో టెస్టులకు బౌలింగ్ ప్లాన్ మార్పు- గిల్ ప్రకటన..!

ఒక్కో ఓవర్‌కు 5 శాతం జరిమానా
నవంబర్ 15న మౌంట్ మౌంగనుయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదో, చివరి వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో సమయ సడలింపులను మినహాయించిన తర్వాత కూడా భారత జట్టు నిర్ణీత సమయంలో 7 ఓవర్లు వెనుకబడి ఉన్నట్లు ఐసీసీ గుర్తించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. నిర్ణీత సమయానికంటే తక్కువగా వేసే ప్రతి ఓవర్ కు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం చొప్పున జరిమానా విధిస్తారు. ఈ లెక్కన భారత్ 7 ఓవర్లు తక్కువగా వేయడంతో ఆటగాళ్లందరికీ 35 శాతం జరిమానా పడింది.

IND vs NZ ICC Fines Team India 35 Match Fee for Slow Over Rate in 5th ODI Ahead of Tests Details

తప్పును అంగీకరించిన తాత్కాలిక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్
ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు తాత్కాలిక సారథిగా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్.. మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగలే విధించిన ఈ జరిమానాను, నేరాన్ని అంగీకరించారు. దీంతో ఈ విషయంపై ఎలాంటి అధికారిక విచారణ నిర్వహించాల్సిన అవసరం రాలేదు.

తనను బూతులు తిట్టిన వాడితోనే ట్రోఫీ గెలిచాడు!.. ధోనీ కెప్టెన్సీ వెనుక షాకింగ్ స్టోరీ!
తనను బూతులు తిట్టిన వాడితోనే ట్రోఫీ గెలిచాడు!.. ధోనీ కెప్టెన్సీ వెనుక షాకింగ్ స్టోరీ!

సిరీస్ గెలిచినా తప్పని జరిమానా
ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే.. ఐదో వన్డేలో విజయం సాధించడం ద్వారా భారత్ వన్డే సిరీస్ ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. లో-స్కోరింగ్ థ్రిల్లర్ గా సాగిన ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్(46), అక్షర్ పటేల్(46) రాణించడంతో భారత్ 209 పరుగులు చేసింది. అనంతరం భారత ప్లేయర్లు చెలరేగడంతో న్యూజిలాండ్ 187 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 22 రన్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. కాగా నవంబర్ 19 నుంచి వెల్లింగ్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+