కోహ్లీ కేరీర్‌లో వరస్ట్ షాట్- అతనికీ తెలుసు: టీమిండియా మాజీ స్టార్ ఎకసెక్కాలు

IND vs NZ: భారత్‌పై బెంగళూరులో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌‌లో ఘన విజయాన్ని సాధించిన న్యూజిలాండ్ ఇప్పుడు కదనోత్సాహంలో ఉంది. రెండో టెస్ట్‌లోనూ విజయఢంకా మోగించడానికి ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో భారత బ్యాటింగ్ ఆర్డర్‌ నడ్డి విరగ్గొట్టింది.

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తిరుగులేని విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో టెస్ట్ మ్యాచ్‌లోనూ అదే తరహా రిజల్ట్ రాదనే గ్యారంటీ లేకుండా పోయింది. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ బౌలర్లు చెలరేగారు. టీమిండియా బ్యాటర్ల భరతం పట్టారు.

IND vs NZ Sanjay Manjrekar criticizes Virat Kohli after getting out in the 2nd test

రెండో రోజు తొలి సెషన్‌లో టీమిండియా ఆలౌట్ అయింది. భోజన విరామ సమయానికి 107 పరుగులకు ఏడు వికెట్లను పడగా.. ఆ తరువాత జట్టు ఆలౌట్ కావడానికి ఎంతో సమయం పట్టలేదు. 156 పరుగులకు చాప చుట్టేసింది. తొలి రోజు చివరి గంటలోనే భారత జట్టు కేప్టెన్ రోహిత్ శర్మ వికెట్‌ను కోల్పోయిన విషయం తెలిసిందే.

రెండో రోజూ వికెట్ల పతనానికి ఎక్కడే గానీ బ్రేకులు పడలేదు. జట్టు స్కోరు 50 పరుగుల వద్ద రెండో వికెట్ పడింది. శుభ్‌మన్ గిల్- 30 పరుగులు చేసి మిఛెల్ శాంట్నర్ బౌలింగ్‌లో ఎల్బీగా అవుట్ అయ్యాడు. అది మొదలు వికెట్లు టపటపమంటూ పడ్డాయి.

యశస్వి జైస్వాల్- 30, విరాట్ కోహ్లీ- 1, రిషభ్ పంత్- 18, సర్ఫరాజ్ ఖాన్- 11, రవిచంద్రన్ అశ్విన్- 4, రవీంద్ర జడేజా- 38, ఆకాష్ దీప్- 6, జస్‌ప్రీత్ బుమ్రా డకౌట్ అయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లల్లో శాంట్నర్ చెలరేగాడు. స్పిన్ మాయాజాలంతో కట్టిపడేశాడు. ఏడు వికెట్లు నేల కూల్చాడు. చివరి మూడు వికెట్లు కూడా అతని ఖాతాలోనే పడ్డాయి.

అయిదు వికెట్లు, అంతకంటే ఎక్కువ వికెట్లు తీసుకోవడం శాంట్నర్‌కు ఇదే తొలిసారి. తన టెస్ట్ కేరీర్‌లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్‌ను రికార్డ్ చేసుకున్నాడీ స్పిన్ బౌలర్. తొలి రోజున వాషింగ్టన్ సుందర్ 59 పరుగులకు ఏడు వికెట్లు పడగొట్టగా.. రెండో రోజున శాంట్నర్ 53 పరుగులకు ఏడు వికెట్లు కూల్చడం హైలైట్‌గా చెప్పుకోవచ్చు.

కాగా- విరాట్ కోహ్లీ అవుట్ అయిన తీరుపై విమర్శలు చెలరేగుతున్నాయి. శాంట్నర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు కోహ్లీ. లోయర్ ఫుల్ టాస్‌గా శాంట్నర్ సంధించిన బంతిని ఆడటంలో తికమక పడ్డాడు. స్వీప్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. టైమింగ్ మిస్ అయ్యాడు. అంతే- నేరుగా వెళ్లి వికెట్లను గాల్లోకి ఎగురగొట్టిందా బంతి.

లోయర్ ఫుల్ టాస్ బంతిని ఎదుర్కొన్న తీరు విమర్శలకు దారి తీసింది. అతని కేరీర్‌లో అదో వరస్ట్ షాట్‌గా అభివర్ణించారు టీమిండియా మాజీ ఓపెనర్, క్రికెట్ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్. తన కేరీర్‌లో అత్యంత చెత్త షాట్ ఆడాననే విషయం కోహ్లీకి తెలిసి ఉంటుందనీ వ్యాఖ్యానించాడు.

నిజాయితీ, చిత్తశుద్ధి, ధృడ సంకల్పంతో బ్యాటింగ్ చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్న విరాట్ కోహ్లీ.. ఈ చెత్త షాట్ ఆడి అవుట్ అయిన తీరు నుంచి త్వరగా కోలుకోవాలని తాను కోరుకుంటోన్నట్లు చెప్పాడు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో ఓ కామెంట్ పోస్ట్ చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+