India-Pakistan Match: భారత్-పాక్ తుది జట్లు ఇవే- టాస్ గెలిస్తే చేయాల్సిందిదే..!
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్తాన్ మధ్య కీలక మ్యాచ్ జరగబోతోంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30కి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ఫలితం కోసం ఇరుదేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. చాలా కాలం తర్వాత ఇరుజట్లూ ముఖాముఖీ తలపడుతుండటంతో మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరుజట్లూ మ్యాచ్ లో బరిలోకి దిగే 11 మంది ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసుకున్నాయి.
దుబాయ్ స్టేడియంలో ఇప్పటికే భారత్ బంగ్లాదేశ్ తో మ్యాచ్ ఆడి గెలిచింది. అయితే ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుని తప్పు చేసిందన్న చర్చ జరిగింది. దీనికి కారణం పిచ్ ను తప్పుగా అంచనా వేయడమే. ఈ మ్యాచ్ లో పిచ్ మందగించిన తీరు, మంచు లేకపోవడం వంటి కారణాలతో భారత్ నిర్ణయం తప్పనే చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ మ్యాచ్ లో ఏ జట్టు టాస్ గెలిచినా కచ్చితంగా బ్యాటింగ్ తీసుకునే అవకాశాలే ఉన్నాయి.

తుది జట్ల విషయానికొస్తే భారత్ ఇప్పటికే బంగ్లాదేశ్ పై గెలిచిన టీమ్ నే ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించనుంది. ఈ లెక్కన రోహిత్ శర్మ కెప్టెన్సీలో శుభ్ మన్ గిల్, విరాట్ కొహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, మొహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ మరోసారి బరిలోకి దిగుతున్నారు. పాకిస్తాన్ విషయానికొస్తే ఈ టోర్నీలో దుబాయ్ లో తొలి మ్యాచ్ ఆడబోతోంది.
ఈ టోర్నీలో కివీస్ తో తొలి మ్యాచ్ ఆడిన పాకిస్తాన్ పలు మార్పులతో భారత్ తో మ్యాచ్ ఆడబోతోంది. ఓపెనర్ ఫఖర్ జమాన్ స్ధానంలో ఇమాముల్ హక్ జట్టులోకి రావడం ఖాయమైంది. దీంతో బాబర్ ఆజమ్ తో కలిసి అతను జట్టు ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. ఆ తర్వాత సాద్ షకీల్, కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్, సల్మాన్ ఆఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, హారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్ ఆడబోతున్నారు.












Click it and Unblock the Notifications