దరిద్రం అనేది చాలా చిన్న పదం - కొత్త పేరు పెట్టాలి
దక్షిణాఫ్రికాతో జరుగున్న రెండో వన్డేలో తడబడుతోంది. ప్రారంభ ఓవర్లల్లో దూకుడుగా కనిపించినా ఆ తర్వాత ఇన్నింగ్ నెమ్మదించింది. ఓపెనర్ రోహిత్ శర్మ ఎక్కువ సేపు క్రీజ్ లో నిల్చోలేకపోయాడు. తొలి వన్డే తరహాలో కుదురుకోవడంలో విఫలం అయ్యాడు. నండ్రె బర్గర్ బౌలింగ్ అవుట్ అయ్యాడు. అవుట్ కావడానికి ముందు హ్యాట్రిక్ బౌండరీలను సాధించాడు రోహిత్. వరుసగా మూడు బంతులను ఫోర్లుగా మలిచాడు. ఆ వెంటనే పెవిలియన్ దారి పట్టాడు.
తొలి మ్యాచ్ లో విజయఢంకా మోగించిన ఊపులో ఉంది భారత్. 1-0 తేడాతో ఈ సిరీస్ పై ఆధిక్యతను సాధించింది. అదే విజయ పరంపరను ఇందులోనూ కొనసాగించాలని కోరుకుంటోంది. రాయ్ పూర్ లో ప్రారంభమైన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు దక్షిణాఫ్రికా కేప్టెన్ టెంబా బావుమా. అతని అంచనా విఫలం కాలేదు. రోహిత్ శర్మ వికెట్ పడగొట్టడంలో దక్షిణాఫ్రికా సక్సెస్ అయింది. క్రీజ్ లో ఉన్న మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడుతున్నారు.

వన్డే ఇంటర్నేషనల్స్ లో ఓ అనుకోని రికార్డును నెలకొల్పింది టీమిండియా. వరుసగా టాస్ ఓడిపోవడంలో చరిత్ర తిరగరాసింది. ఇప్పటివరకు వరుసగా 20 వన్డేల్లో టాస్ ఓడిపోయింది. 2023 నుంచీ ఇదే పంథా. క్యాలెండర్ మారుతోందే తప్ప వన్డేల్లో టాస్ గెలిచిన పాపాన పోలేదు. ఇప్పటివరకు ఇన్నేసి సార్లు టాస్ ఓడిపోయిన జట్టు మరొకటి లేదంటే ఆశ్చర్యమే మరి. క్రికెట్ చరిత్రలోనే ఇదో చాలా అరుదైన ఉదంతం.
కాగా- భారత్ జట్టులో ఎటువంటి మార్పులు లేవు. తొలి మ్యాచ్ లో జట్టు సమష్టిగా రాణించడం, బౌలింగ్, బ్యాటింగ్ లో సత్తా చాటిన నేపథ్యంలో ప్రయోగాలకు వెళ్లలేదు. జట్టులో మార్పులు చేయలేదు. దక్షిణాఫ్రికా మాత్రం మూడు మార్పులు చేసింది. తొలి వన్డేకు అందుబాటులో లేని కేప్టెన్ టెంబా బవుమా రిటర్న్ అయ్యాడు. అలాగే కేశవ్ మహారాజ్, లుంగీ ఎన్గిడిలను తిరిగి ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చారు.
టీమిండియా ప్లేయింగ్ 11లో- యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్ (కేప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.
దక్షిణాఫ్రికా తుదిజట్టులో - క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఎయిడెన్ మార్క్ రమ్, టెంబా బవుమా (కేప్టెన్), మాథ్యూ బ్రీట్జ్‌కే, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో జాన్సెన్, కార్బిన్ బోష్, కేశవ్ మహారాజ్, నాండ్రే బర్గర్, లుంగీ ఎన్గిడి ఉన్నారు.
-
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications