IPL 2024: రోహిత్ కెప్టెన్సీ లాక్కోవడంపై నోరు విప్పిన హార్దిక్ పాండ్యా-జరిగేది ఇదేనంటూ..!
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ కు ముంబై ఇండియన్స్ జట్టులోకి రావడంతో పాటు కెప్టెన్ గా కూడా ఛాన్స్ కొట్టేసిన హార్దిక్ పాండ్యా.. అప్పటి నుంచి ఈ వ్యవహారంపై నోరు మెదపడం లేదు. ఏం మాట్లాడితే ఏం తంటా వస్తుందనుకున్నాడో ఏమో మౌనంగా ఉండిపోయాడు. మరోవైపు అప్పటివరకూ కెప్టెన్ గా ఉంటూ ముంబై ఫ్రాంచైజీ నిర్ణయంతో మాజీగా మారిపోయిన రోహిత్ శర్మ వైపు నుంచి మాత్రం అభిమానులు, అతని భార్య ఇలా పలువురు వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు.
ఈ నేపథ్యంలో ఐపీఎల్ సీజన్ ప్రారంభ వేళ ఎట్టకేలకు హార్దిక్ పాండ్యా నోరు విప్పాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పుతో పాటు మాజీ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మతో తన సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇవాళ ముంబై ఇండియన్స్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హార్దిక్ మాట్లాడుతూ.. రోహిత్‌కి తనకు మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని అనుకోవడం లేదన్నాడు.

ముంబై ఇండియన్స్ జట్టులోకి తిరిగి రావడం ఓ వాస్తవాన్ని మించిన అనుభూతి అని హార్దిక్ పాండ్యా వ్యాఖ్యానించాడు. అయితే 2015 నుంచీ తనకు తెలిసిందంతా ఈ ప్రయాణం ద్వారానే జరిగిందన్నాడు. ఈ స్ధాయికి తాను చేరుకుంటానని ఎప్పుడూ అనుకోలేదని పాండ్యా తెలిపాడుప. తనకు ఇష్టమైన వాంఖడే మైదానంలో ఆడాలని ఎదురు చూస్తున్నట్లు హార్దిక్ చెప్పుకొచ్చాడు.
అలాగే కెప్టెన్సీ మార్పు గురించి ప్రశ్నిస్తే.. ఆల్ రౌండర్ తనకు అవసరం అనిపించినప్పుడల్లా రోహిత్ తన వైపు చూశాడన్నాడు.
రోహిత్ టీమిండియా కెప్టెన్ అని, ఇది కూడా తనకు పనికొచ్చే అంశమన్నాడు.












Click it and Unblock the Notifications